Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో పోలీసు స్టేషన్లో జంట పేలుళ్లు.. 8 మంది దుర్మరణం

పాకిస్తాన్‌లో పోలీసు స్టేషన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన ఎనిమిది మందిలో పోలీసులే ఎక్కువ మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
 

two explosions hit pakistan police station, 8 killed kms
Author
First Published Apr 24, 2023, 11:49 PM IST

పేషావర్: పాకిస్తాన్‌లో కౌంటర్ టెర్రరిజం ఆఫీసును రెండు పేలుళ్లు వణికించాయి. ఈ జంట పేలుళ్లలో కనీసం ఎనిమిది మంది మరణించారు. మరెందరో మంది ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై ప్రావిన్షియల్ పోలీసు చీఫ్ అఖ్తర్ హయాత్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వాయవ్య  స్వాత్ వ్యాలీలో పేలుళ్లు ఎలా జరిగాయనే దానిపై స్పష్టత లేదని అన్నారు. గతంలో ఈ రీజియన్‌ ఇస్లామిస్ట్ మిలిటెంట్ల హయాంలో ఉన్నది. 2009 మిలిటరీ ఆపరేషన్‌లో వారిని ఇక్కడి నుంచి తరిమేశారు.

పేలుడు సంభవించిన కౌంటర్ టెర్రరిజం ఆఫీసు వద్ద పాత పేలుడు పదార్థాల గోదాం ఒకటి ఉన్నదని హయాత్ వివరించారు. ఈ పేలుళ్లకు గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ గోదాంలోనే ఏదైనా కారణంగా పేలుళ్లు సంభవించాయా? లేదా  ఉగ్రవాదులే దాడి చేశారా? అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యతను ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదని తెలిపారు.

Also read: ఆపరేషన్ కావేరి.. సుడాన్‌ నుంచి భారతీయులు తరలింపు ప్రారంభం.. పోర్టు సుడాన్ చేరకున్న 500 మంది..

ఈ పేలుళ్లలో ఎనిమిది మరణిం చారని, అందులో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారని చెప్పారు. ఓ రెస్క్యూ అధికారి మాట్లాడుతూ, ఇది పాత భవనం అని, దాని కొన్ని భాగాలు కూలిపోయాయని వివరించారు. కాబట్టి, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నద ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios