Asianet News TeluguAsianet News Telugu

మీటింగ్ జరిగింది అరగంట.. ఖర్చు రూ.100కోట్లు


సింగపూర్ లో నేటి మీటింగ్ ఖర్చు అది

Trump-Kim summit: S$20m bill to host US-North Korea meeting

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ల భేటికి సింగపూర్ లోని సెంటోసా ద్వీపం వేదికయ్యింది. ఈ ఇద్దరు దేశాధ్యక్షులు నేడు ఇక్కడ సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఇద్దరు దేశాధ్యక్షులు కలుస్తుండటంతో.. ప్రపంచమంతా వీరిపైనే దృష్టికేంద్రీకరించింది. కాగా.. వీరిద్దరి భేటీకి ఏర్పాట్లు కూడా ఘనంగానే జరిగాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ ఇద్దరు నేతలు 38 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే ఈమాత్రం సమావేశానికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా  20 మిలియన్ డాలర్లు.  ఇండియన్ కరెన్సీలో రూ.100కోట్ల పైమాటే.  ఇందులో భద్రతా ఏర్పాట్లతోపాటు నార్త్ కొరియా బృందం ఖర్చులు కూడా ఉన్నాయి. 

కిమ్ సెయింట్ రెగిస్ హోటల్‌లో బస చేయడానికి అయ్యే ఖర్చుతోపాటు మొత్తం కొరియా ప్రతినిధుల బృందం ఖర్చులన్నీ తామే భరిస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశం జరిగిన కాపెల్లా రిసార్ట్ ఫైవ్ స్టార్ హోటల్‌లో వంద గదులు ఉన్నాయి. ఈ చారిత్రక భేటీ కోసం అన్ని రూమ్‌లను బుక్ చేశారు.

ఇదేమీ తక్కువ స్థాయి హోటల్ కాదు. ఇందులో ఓ సాధారణ రూమ్‌కు కూడా ఓ రాత్రికి 400 డాలర్ల ఖర్చు అవుతుంది. ఇక ట్రంప్‌తోపాటు ఆయన బృందం ఉండటానికి షాంగ్రీ లా హోటల్ కేటాయించారు. ఈ హోటళ్లలో ఒక్క రాత్రి గడపటానికి సగటున 300 డాలర్లు అవుతుంది. ఆ లెక్కన మొత్తానికి ఎంతవుతుందో మీరే ఊహించుకోండి. ఈ భేటీని కవర్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి 2500 మంది మీడియా ప్రతినిధులు వచ్చారు. వీళ్ల కోసం ప్రత్యేకంగా ఓ మీడియా సెంటర్‌నే సింగపూర్ నిర్మించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios