అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వైట్ హౌస్ వేదికగానే మాటలయుద్దానికి దిగాడు. ఈ వ్యవహారంమ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటలయుధ్దం ఎలా సాగిందో యధావిధిగా...

ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్దం ... ఎవరేమన్నారో యధావిధిగా 

Trump vs Zelensky : ఇప్పటికే ఓ స్ట్రాంగ్ కంట్రీతో యుద్దం చేస్తూ సతమతం అవుతున్న చిన్న దేశమది. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అగ్రరాజ్యంతో పెట్టుకుంది. ఇలా ప్రపంచానికి పెద్దన్నలుగా భావించే రష్యా, అమెరికాలతో గొడవ పెట్టుకుంది ఉక్రెయిన్. రష్యాతో వివాదం కారణంగా గత కొన్నేళ్లుగా ఆ దేశం కాల్పులతో అట్టుడుకుతోంది... ఇప్పుడు అమెరికాతో వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదంలో కూర్చుని... అత్యంత కఠినమైనవాడిగా పేరున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే జెలెన్ స్కీ వాగ్వాదానికి దిగాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తో కూడా వాగ్వాదానికి దిగాడు. ఇలా అమెరికా మీడియా ముందే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య మాటల యుద్దం సాగింది. ఇలా వారి మధ్య జరిగిన హీటెడ్ సంభాషణ యధావిధిగా...

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ మొదట రియాక్ట్ అయ్యాడు. 

డొనాల్డ్ ట్రంప్ : నేను ఎవరివైపు నిలవడంలేదు. ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల్లో ఎవరికి దగ్గరకాదు. పుతిన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంలేదు. నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలకు దగ్గరవుతున్నా... ప్రపంచానికి దగ్గరవుతున్నా. తనను ఇష్టపడనివారితో (జెలెన్ స్కీ వైపు చూపిస్తూ) కూడా డీల్ చేయడానికి సిద్దమయ్యాను. నేను యావత్ ప్రపంచాన్ని ఏకం చేయాలనుకుంటున్నా. 

జెడి వాన్స్ : గత నాలుగేళ్లలో ఏనాడైనా అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి రష్యాను ప్రశ్నించారు. రష్యా - ఉక్రెయిన్ పై యుద్దం గురించి స్పందించారా? దౌత్యం ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసారా? ప్రస్తుతం ట్రంప్ దౌత్యం ద్వారా ఆ పని చేస్తున్నారు. అమెరికాను మంచి దేశంగా తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలతో దౌత్యం చేస్తున్నారు. 

జెలెన్ స్కీ : నేను ఓ విషయం అడగనా? 

వాన్స్ : తప్పకుండా 

జెలెన్ స్కీ : ఉక్రెయిన్ లోని చాలాభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. 2014 నుండి ఇది జరుగుతోంది. అప్పటి నుండి ఇప్పటివరకు ఒబామా, ట్రంప్, బైడెన్, మళ్లీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.ఎవరూ వారిని ఆపలేదు. 

ట్రంప్ : 2014 లో నేను ఇక్కడ లేను. 

జెలెన్ స్కీ : 2014 నుండి 2022 వరకు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది... సరిహద్దుల్లో ప్రజలు చనిపోయారు. అప్పుడు ఎవరూ ఆపలేదు. చాలాసార్లు దౌత్యపరమైన చర్చలు జరిపాం. 2019 లో నేను పుతిన్ తో ఓ డీల్ చేసుకున్నాను... కాల్పుల విరమణ కోసం. ఇకపై ఎలాంటి కాల్పులు ఉండవని చెప్పారు. 

అయితే తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్లు (రష్యా) ఉళ్లంఘించారు. ఖైదీలను మార్పిడిపై ఒప్పందం చేసుకున్నాం.కానీ అతను అలా చేయలేదు. జేడి వాన్... మీరు ఎలాంటి దౌత్యం గురించి మాట్లాడుతున్నారు. మీ ఉద్దేశ్యం ఏమిటి? 

జెడి వాన్స్ :నేను మీ దేశ విధ్వంసాన్ని అంతం చేసే దౌత్యం గురించి మాట్లాడుతున్నాను. అయినా మీరు మా ఆఫీసుకు వచ్చి అమెరికా మీడియా ముందు ఇలా వాగ్వాదానికి దిగడం అగౌరవంగా భావిస్తున్నాము. 

జెలెన్ స్కీ : మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు చెబుతున్నారు.

వాన్ : నేను కొన్ని కథనాలు చూసాను. మిలిటరీలో ప్రజలను తీసుకువస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. అయినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఓవల్ కార్యాలయానికి వచ్చి మీ దేశ విధ్వంసాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న పరిపాలకులపై దాడి చేయడం గౌరవప్రదంగా భావిస్తున్నారా? 

జెలెన్ స్కీ : చాలా ప్రశ్నలు ఉన్నాయి. మొదటి నుండి ప్రారంభిద్దాం. యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. మీకు మంచి సముద్రం ఉంది ఇప్పుడు మీకు ఇలాంటి సమస్యలు లేవు. కానీ భవిష్యతో మీను అనుభవిస్తారు. 

(ఈ మాటలకు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేసారు) 

ట్రంప్ : మేము అనుభవిస్తామని అనవద్దు. మేము సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. 

జెలెన్స్ స్కీ : నేను మిమ్మల్ని అనడంలేదు. ప్రశ్నకు జవాబు చెబుతున్నా. 

ట్రంప్ : మీరు మమ్మల్ని శాసించే స్థాయిలో లేరు. మేము అనుభవిస్తామని అనడమేంటి? మేము చాలా మెరుగ్గా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. 

(ట్రంప్, జెలెన్స్ స్కీ మధ్య వాగ్వాదం సాగింది) 

ట్రంప్ : నువ్వు మిలియన్ల కొద్ది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నావు. వరల్డ్ వార్ 3 కి కారణం అయ్యేలా ఉన్నావు. మా దేశాన్ని చాలా అవమానిస్తున్నావు. ఇంతమంది ముందు ఇలా మాట్లాడతావా? 

వాన్స్ : మీరు అక్టోబర్‌లో పెన్సిల్వేనియాకు వచ్చి ప్రతిపక్షం తరపున ప్రచారం చేసారు.మీ దేశాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న అధ్యక్షుడిని అభినందించండి. 

జెలెన్ స్కీ : మీరు యుద్దం గురించి గట్టిగా అరుస్తుంటే ... 

ట్రంప్ : ఆయన(వాన్స్) అరవడంలేదు. మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నారో చెబుతున్నారు. (జెలెన్ స్కీ ఏదో చెప్పబోతుంటే ఆపి) మీరు ఇప్పడికే చాలా మాట్లాడారు. మీ దేశం ఇప్పటికే చాలా సమస్యల్లో ఉంది.

జెలెన్ స్కీ: నాకు తెలుసు. 

ట్రంప్ : మీరు గెలవడం లేదని నాకు తెలుసు. మీరు ఎప్పటికీ గెలవలేరు.

జెలెన్ స్కీ : యుద్ధం ప్రారంభం నుండి బలంగా పోరాడుతున్నాం. మేము మా దేశంకోసం ఒంటరిగానే పోరాడుతున్నాం.

ట్రంప్ : మా ఈ తెలివితక్కువ అధ్యక్షుడు (బైడెన్ ని ఉద్దేశించి) మీకు 350 బిలియన్ల డాలర్లు ఇచ్చారు. మేము మీకు సైనిక పరికరాలు ఇచ్చాము. మీరు, మీ మనుషులు ధైర్యవంతులు, కానీ వారు మా సైన్యాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. మీ వద్ద మా సైనిక పరికరాలు లేకపోతే ఈ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేది. 

జెలెన్ స్కీ : 3 రోజుల్లో... 3 రోజుల్లో ఓడిపోయేవారమని పుతిన్ అంటుంటే విన్నాను. 

ట్రంప్ : ఇలాంటి వ్యాపారం చేయడం చాలా కష్టమైన పని అవుతుంది.

వాన్స్ : అమెరికా మీడియా ముందు ఇలా వాగ్వాదానికి దిగి తప్పు చేస్తున్నారు.

ట్రంప్ : ఏం జరుగుతుందో అమెరికా ప్రజలు చూస్తున్నారు.ఇది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. అందుకే నేను దీన్ని చాలాసేపటి నుండి కొనసాగించాను. మీరు కృతజ్ఞతతో ఉండాలి.

మీ ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనికులు తక్కువగా ఉన్నారు. వినండి, మీకు సైనికులు తక్కువగా ఉన్నారు. అయినా మీరు కాల్పుల విరమణకు అంగీకరించడంలేదు(వెక్కిరిస్తూ). చూడండి... మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు ఒప్పుకుంటే యుద్దం ఆగిపోతుంది. 

జెలెన్ స్కీ : కాల్పుల విరమణ గురించి మా ప్రజలను అడగండి

ట్రంప్ : మీరు ఏది చెప్పినా వినడానికి బైడెన్ కాదు. ఆయన (బైడెన్) తెలివైనవాడు కాదు. ఒబామా మీకు రక్షణ కవచాలు ఇచ్చాడు.నేను మీకు బళ్లాలు (జావలిన్స్) ఇచ్చాను. ఈ స్టేట్ మెంట్ గుర్తుపెట్టుకొండి... ఒబామా రక్షణ కవచాలు ఇస్తూ ట్రంప్ బళ్లాలు ఇచ్చారు. ఇందుకు మీరు కృతజ్ఞతతో ఉండాలి. మీకు కవచాలు లేకుండే... మేము లేకుంటే మీకు రక్షణ కవచాలే లేవు. 

వీడియో

YouTube video player

ఇవి కూడా చదవండి :

వైట్ హౌస్ లో కూర్చుని ట్రంప్ నే ఎదిరించిన జెలెన్‌స్కీ ... బహిరంగంగానే దేశాధినేతల వాగ్వాదం

Trump-Zelensky: ట్రంప్ ఎవడిని కెలకకూడదో వాడిని కెలికేశాడు! ఇప్పుడు పరిస్థితి ఏంటంటే