ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే పెట్టుకున్నాడు. ఇరు దేశాల మధ్య గొడవ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.   

Trump vs Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రష్యా వంటి పెద్ద దేశంలో యుద్దం చేస్తోంది ఉక్రెయిన్... ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ దేశం అమెరికాతోనూ పెట్టుకుంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఆ దేశంలో పర్యటిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యాడు జెలెన్‌స్కీ. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతల మధ్య మాటలయుద్దం సాగింది... ఓ దశలో ఇద్దరి ఆగ్రహం కట్టలుతెంచుకుంది. . ఇద్దరు దేశాధినేతలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు. రష్యాతో యుద్దం మీవల్ల కాదు... అమెరికా సాయం లేకుంటే మీరు ఎప్పుడో ఓడిపోచేవారని ట్రంప్ అన్నాడు. కాబట్టి రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి సూచించాడు. ఇదే వివాదానికి దారితీసింది.

మీడియా ఎదుటే అధ్యక్షుడు ట్రంప్ తీరును జెలెన్‌స్కీ తప్పుబట్టాడు. ట్రంప్ కూడా అదే స్థాయిలో స్పందించారు... తనతో వాగ్వాదానికి దిగిన జెలెన్‌స్కీ స్టుపిడ్ ప్రెసిడెంట్ అంటూ మండిపడ్డారు ట్రంప్. ఇద్దరు దేశాధినేతలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు. ట్రంప్ సూటిగా మాట్లాడుతూ.. 'మీరు రాజీ పడండి లేదా మేము బయటకు వెళ్తాం'' ట్రంప్ హెచ్చరించారు. జెలెన్‌స్కీ కూడా మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇకపైనా రష్యాతో బలంగా పోరాడతామని స్పష్టం చేసారు. 

Scroll to load tweet…

మీటింగ్ మొదలవగానే ట్రంప్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు

నిజానికి మీటింగ్ మొదలవగానే ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి చేస్తూ.. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు.. మీరు రష్యాతో యుద్ధం గెలవలేరు అన్నారు. దీనికి జెలెన్స్కీ బదులిస్తూ.. మేము మా దేశంలో ఉన్నాం, ఇప్పటి వరకు బలంగా నిలబడ్డాం. మీ సపోర్ట్ తీసుకున్నాం, అందుకే థాంక్స్ కూడా చెప్పాం అన్నారు.

ఈ వాదన చూస్తుండగానే మరింత ముదిరిపోయింది. ఇద్దరు లీడర్ల మధ్య వాదన ఎంతలా పెరిగిపోయిందంటే అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ మీడియా కూడా షాక్ అయింది. ట్రంప్ డైరెక్ట్‌గా మాట్లాడుతూ.. మీరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నారు, ఇది అమెరికాకు అవమానకరం అన్నారు. ట్రంప్ మాటలకు జెలెన్స్కీ కోపంతో ఊగిపోయారు.

Scroll to load tweet…

జేడీ వన్స్ పరిస్థితిని చక్కదిద్దాలని చూసినా...

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జే. డీ. వాన్స్ కూడా జెలెన్స్కీని కూల్ చేయడానికి ట్రై చేస్తూ.. యుద్ధం ఆపడానికి రాయబారాలు అవసరం అన్నారు. కానీ జెలెన్స్కీ వెంటనే బదులిస్తూ.. ఎలాంటి రాయబారాలు? మా ప్రజలు చనిపోతుంటే? అన్నారు.

దీంతో ట్రంప్ మరింత కోపంగా.. మేము మీకు 350 బిలియన్ డాలర్ల సాయం చేశాం, మోడ్రన్ మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఇచ్చాం. అమెరికా సాయం చేయకపోతే ఈ యుద్ధం రెండు వారాల్లోనే అయిపోయేది అన్నారు. దీనికి జెలెన్స్కీ సూటిగా సమాధానమిస్తూ.. అవును అవును, పుతిన్ కూడా ఇదే చెబుతారు! అన్నారు.

ట్రంప్ జెలెన్స్కీని తిడుతూ.. ప్రజలు చనిపోతున్నారు, మీ సైనికులు తగ్గిపోతున్నారు అయినా మీరు కాల్పుల విరమణ (Ceasefire) కోరుకోవడం లేదా? మీరు ఇప్పుడే కాల్పుల విరమణ ప్రకటన చేయాలి, తద్వారా బుల్లెట్లు పేలడం ఆగి ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. కానీ జెలెన్స్కీ తన వాదనను అంతే వేగంగా వినిపించారు. జెలెన్స్కీ వైఖరి నచ్చని ట్రంప్ చివర్లో మీరు ఇలాగే ఉంటే అమెరికాకు ఉక్రెయిన్‌తో వ్యాపారం చేయడం కష్టం అవుతుంది అన్నారు.