మృతుల కుటుంబాలకు ఎన్నారైల ఆర్థిక సాయం

First Published 11, Jun 2018, 2:45 PM IST
TRS NRI cell extends financial assistance
Highlights

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ఇటీవల బహరేన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ఇటీవల బహరేన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. ఒక్కరు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ మండలంలోన, ఫతేపూర్ గ్రామానికి చెందిన ఎర్రం శంకర్ (35). ఇతను బహరేన్ లో గుండెపోటుతో మృతిచెందాడు, 

శంకర్  అన్నయ్య కూడ బహరేన్ లో వున్నాడు. మృతుడికి తల్లి తండ్రి భార్యతో పాటు ఐదు సంవత్సరాల పాప వుంది. వీరి మరణంతో పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో రూ.10.000 భార్య పుష్పకు బ్యాంక్ ద్వారా పంపిచడం జరిగింది. 

మరొకరు బోధన్ మండలంలోని తట్టుకోట్ కి చెందిన కల్లా విజయ్. ఇతను బహరేన్ లో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇతని మరణంతో పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో రూ.10.000 అతని తండ్రి పోశెట్టి కి బ్యాంక్ ద్వారా పంపిచడం జరిగింది. 

అలాగే తమ వంతు భాద్యతగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందే విధంగా కృషిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రాజేంధార్, రవిపటేల్, గంగాధర్, జాయంట్ సెక్రెటరీలు విజయ్, దేవన్న, రాజేందర్ రావు, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సాయన్న, నర్సయ్య, గంగారాం పాల్గొన్నారు.

loader