కవిత చేదుల మీదుగా లండన్ బోనాల పోస్టర్

First Published 31, May 2018, 4:49 PM IST
TRS MP Kavitha launches Bonalu Jatara poster
Highlights

లండన్ బోనాల జాతర పోస్టర్ ని   పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్ లో  ఆవిష్కరించారు.

లండన్ :  తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని  సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని   పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్ లో  ఆవిష్కరించారు.  


తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా,  తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. 

ఈ కార్యక్రమంలో టాక్  సంస్థ ప్రతినిధులు శ్వేతా రెడ్డి, జాహ్నవి, మల్లేష్ పప్పుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయిన, రోహిత్ రావు, పసుల చరణ్  తదితరులు పాల్గొన్నారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత  టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రత్యేక కృతఙతలు తెలిపారు. ఎంపీ కవిత ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని మీడియాకి తెలిపారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. 

loader