బహామాస్ సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. అది బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది చనిపోయారు. పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
హైతీ వలసదారులతో బహామాస్ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు బహామియా భద్రతా దళాలు 17 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. 25 మందిని రక్షించాయి. న్యూ ప్రొవిడెన్స్ నుండి ఏడు మైళ్ల దూరంలో ఈ పడవ మునిగిపోయింది. అయితే ఇంకా ఎంత మంది నీట మునిగిపోయారో స్పష్టంగా తెలియడం లేదు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉందని ఆ దేశ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించామని, అక్కడ వైద్య సిబ్బంది వారికి చికిత్స అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
లైవ్ లో భార్య మీద పెట్రోల్ పోసి, నిప్పంటించిన భర్త.. ఉరిశిక్ష అమలు...
ఒక డబుల్ ఇంజిన్ స్పీడ్ బోట్ బహామాస్ నుండి దాదాపు 60 మంది వలసదారులతో బయలుదేరినట్లు పరిశోధకులు నిర్ధారించారని డేవిస్ చెప్పారు. అనుమానిత మానవ స్మగ్లింగ్ ఆపరేషన్‌పై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ‘‘ ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రభుత్వం, బహామాస్ ప్రజల సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ’’ అని ఆయన పేర్కొన్నారు. తన గవర్నమెంట్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇలాంటి యాత్రలు వద్దని చెబుతూ, హెచ్చరిస్తూనే ఉన్నదని అన్నారు.
కాగా ఈ ఘటనపై హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ మాట్లాడుతూ.. బాధితుల తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిందని చెప్పారు. ‘‘ మన నేల, మన సోదరులు, సోదరీమణులు, మన పిల్లలకు దూరంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నేను మరోసారి జాతీయ సయోధ్య కోసం విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని అన్నారు.
Monkeypox : మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. అప్రమత్తంగా ఉండాలి - డబ్ల్యూహెచ్ఓ
కాగా.. గత నెల చివరిలో ఆఫ్రికాలోని సెనెగల్ సముద్ర తీరంలో కూడా ఒక పడవ బోల్తా పడింది. ఆ ఘటనలో కూడా 13 మంది చనిపోయారు. మరి కొంత మంది కనిపించకుండా పోయారు. వలసదారులతో యూరప్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వలసదారుల మృతిని రెడ్ క్రాస్ అధికారులు ధృవీకరించారు. ఈ దురదృష్టకర ఘటన దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో జరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ పడవలో సుమారు 150 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 91 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఈఘటనపై ఆ దేశ అధ్యక్షుడు సాల్ సంతాపం తెలిపారు.
దారుణం.. హారన్ కొట్టినా స్కూటీకి దారి ఇవ్వలేదని మూగ, చెవిటి వ్యక్తిని పొడిచి చంపిన మైనర్...
చాలా ప్రమాదకరైన పరిస్థితుల్లో చిన్న చిన్న పడవలను తీసుకొని ఐరోపాకు వెళ్తుంటారు. ఇలా ప్రతీ సంవత్సరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఆగస్టులో కూడా పెద్ద ప్రమాదమే జరిగింది. సెయింట్ లూయిస్ వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారని అధికారులు తెలియజేశారు.
