మంకీప్యాక్స్ వైరస్ పట్ల అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని చెప్పింది. దీనిని నివరించడానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, అప్రమత్తండా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన ఒక రోజు తరువాత ఆ సంస్థ ఆగ్నేయ ఆసియా రీజియన్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, తీవ్రమైన ప్రతిస్పందనను అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ‘‘ ఇంతకు ముందు ఈ వైరస్ వెలుగులోకి రాని అనేక దేశాలకు, అలాగే ఇప్పటికే ప్రమాదంలో పడిన మిగితా దేశాల్లోని జనాభాకు దీనిని వ్యాప్తి చెందకుండా నిరోధించాలి’’ అని అన్నారు.
ఇండియాలో చదువుకి అనుమతివ్వాలి: ఆందోళనకు దిగిన ఉక్రెయిన్ నుండి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ప్రమాదం ప్రస్తుతం ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ దాని.. తరువాత ఇది అంతర్జాతీయంగా వ్యాప్తి చెందే సంభావ్యత వాస్తవమని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ‘‘ మనం అప్రమత్తంగా ఉండాలి. మంకీపాక్స్ మరింత వ్యాప్తిని తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి ’’ అని ఆమె అన్నారు.
అరుదైన వైరస్ వ్యాప్తిని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్ఓ శనివారం ప్రకటించింది. ఇప్పటివరకు, 70 కి పైగా దేశాలలో మంకీపాక్స్ కేసులు గుర్తించబడ్డాయి మరియు ఈ సంఖ్య 14,000 మార్కును దాటింది. గత వారంలో ఆరు దేశాలు తమ మొదటి కేసులను నివేదించాయని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ ఈ వారం ప్రారంభంలో తెలిపింది. మంకీపాక్స్ కోసం నిఘా, ప్రజారోగ్య చర్యలను బలోపేతం చేయాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది, ఈ వ్యాధిని అంతర్జాతీయ ఆందోళన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు.
‘‘ డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, మంకీపాక్స్ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా, అన్ని ప్రాంతాలలో ఒక మోస్తరుగా ఉంది. యూరోపియన్ ప్రాంతంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో మేము ప్రమాదాన్ని ఎక్కువగా అంచనా వేస్తున్నాము. అంతర్జాతీయ ట్రాఫిక్ లో జోక్యం చేసుకునే ప్రమాదం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ మరింత అంతర్జాతీయ వ్యాప్తి చెందే స్పష్టమైన ప్రమాదం కూడా ఉంది ’’ అని అని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ శనివారం చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక వ్యాప్తి ఉందని, ఇది కొత్త ప్రసార విధానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. అయితే దీని గురించి డబ్ల్యూహెచ్ఓ చాలా తక్కువ అర్థం చేసుకుంటుందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల్లోని ప్రమాణాలను చేరుకుంటుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా భారత్ లో కూడా ఈ కేసులు కలకరం రేపుతున్నాయి. నిన్నటి వరకు మూడు గా ఉన్న కేసులు ఈరోజుతో నాలుగు అయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 31ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ రోగిని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేర్చారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలను సందర్శించినట్టు గుర్తించారు. కానీ, అతనికి విదేశీ ప్రయాణం చేసిన చరిత్ర లేదు. మొదటి మూడు కేసులు కేరళలలో నమోదు అయ్యాయి.
