Asianet News TeluguAsianet News Telugu

ఈ బాస్ చాలా గ్రేట్.. ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నం రూ.63 లక్ష‌లు, రిమోట్ వ‌ర్క్.. అంద‌రూ తనలాగే ఉండాలని పిలుపు

ఓ బాస్ తన ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. తన ఉద్యోగులకు ఇస్తున్న సాలరీ, పెరెంటల్ లీవ్స్, రిమోట్ వర్క్ వంటి విషయాలను ఆయన పోస్ట్ చేశారు. అందరు బాస్ లు తనలాగే ఉండాలని పిలుపునిచ్చారు. 

This boss is very great.. The minimum salary for the employees is Rs. 63 lakhs, remote work.. He calls everyone to be like him.
Author
New Delhi, First Published Aug 9, 2022, 3:15 PM IST

ఈ బాస్ అంద‌రి లాంటి బాస్ కాదు. ఫ్రెండ్లీ బాస్. ఉద్యోగుల సంక్షేమాన్ని ప‌ట్టించునే బాస్. ఈ బాస్ గురించి తెలుసుకుంటే మీరు కూడా త‌ప్ప‌క మెచ్చుకుంటారు. మీకు కూడా ఇలాంటి బాసే కావాల‌ని కోరుకుంటారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారు ? ఏంటి ఆయ‌న ప్ర‌త్యేక‌త అంటారా ? ప‌దండి అదే విష‌యం తెలుసుకుందాం..

ఆమెరికాలోని సియాటిల్ సిటీలో గ్రావిటీ పేమెంట్స్ అనే సంస్థకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న సీఈవో పేరు డాన్ ప్రైస్. ఆయ‌న త‌న ఉద్యోగులకు కనీస వేతన ప్యాకేజీ రూ .63.7 లక్షలు (80,000 డాలర్లు) చెల్లిస్తున్నారు. దీంతో పాటు వారికి రిమోట్ (ఎక్క‌డి నుంచి అయినా ప‌ని) ఫ్లెక్సిబుల్ వ‌ర్కింగ్ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే పేరెంటల్ లీవ్స్ ను కూడా ఇస్తున్నారు. ఏంటి ఇదంతా నిజామా ? అని అనుకుంటున్నారా ? అవును. మీరు చ‌దువుతున్నది అక్ష‌ర స‌త్యమే.

Bihar Political Crisis: బీజేపీతో జేడీయూ కటీఫ్.. 4 గంటలకు గవర్నర్ వద్దకు తేజస్వీతో నితీష్ కుమార్!

అయితే ఆయ‌న త‌న‌లాగే అన్ని కంపెనీలా బాస్ లు ఉండాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల డాన్ ప్రైస్ ప‌లు కంపెనీలను పిలిచి త‌న అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని కోరారు. ‘‘ నా కంపెనీ 80 వేల డాలర్ల కనీస వేతనం చెల్లిస్తోంది. ఉద్యోగులు తాము కోరుకున్న చోటు నుంచి ప‌ని చేయ‌డానికి అనుమ‌తిస్తోంది. వారికి మీరు కూడా పూర్తి ప్ర‌యోజ‌నాలు చెల్లించింది. పేరెంటల్ లీవ్ ఇవ్వండి. ఇంకా మెరుగైన వ‌స‌తులు క‌ల్పించండి ’’ అని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ‘‘మాకు ఒక ఉద్యోగి కావాల‌ని కోరితే దాదాపు 300కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ’’ అని ఆయన అన్నారు. 

‘‘ ఎవరూ పని చేయడానికి ఇష్ట‌ప‌డ‌రు అనేది కంపెనీలో చెప్పే ఒక అబ‌ద్దం. ఎందుకంటే కంపెనీలు వారికి న్యాయ‌మైన వేత‌నాన్ని చెల్లించ‌వు. అలాగే వారిని గౌర‌వంగా చూడ‌వు. అలాంటప్పుడు వారు ఎందుకు ప‌ని చేస్తారు. ’’ అని సీఈవో ప్రైస్ అన్నారు. ఆయ‌న ఈ విష‌యాల‌ను ఇన్ స్టాగ్రామ్ లో ఈ విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. అయితే ఈ పోస్ట్ లు సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్స్ వ‌స్తున్నాయి. ఓ యూజర్ ఇలా కామెంట్ చేశారు. ‘‘ నా ఉద్యోగంలో నాకు రావాల్సిన జీతం కంటే మూడింట ఒక వంతు మాత్ర‌మే చెల్లిస్తున్నారు. నాకు ప‌ని చేసేందుకు వేరే స్థ‌లం కావాలి. మీరు ఎప్పుడైనా కెనడాలో కంపెనీ ఓపెన్ చేస్తే.. జాబ్ కోసం అప్ల‌య్ చేసుకునే మొద‌టి వ్య‌క్తినే నేనే అవుతాను. మరో యూజర్ ‘‘ గతేడాది మీరు కనీస వేతనం 70 వేల డాలర్లుగా ఇచ్చారు. మీరు మ‌ళ్లీ దీనిని పెంచ‌డం పిచ్చిగా క‌నిపిస్తోంది. చాలా మంది పేద సీఈవోలు ఏడుస్తున్నారు. త‌మ‌ను త‌ప్ప వారు ప్ర‌తీదాన్ని నిందిస్తున్నారు. మీరు డాన్ గా ఉండటం ఆపకండి! ’’ అని కామెంట్ చేశారు. 

గతంలో కూాడా సీఈవోగా త‌న జీతంలో కోత విధించుకొని ఉద్యోగులంద‌రికీ సామానంగా వార్షిక వేత‌నాన్ని రూ.55.7 లక్షలకు (70 వేల‌ డాలర్లు) నిర్ణ‌యించి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ స‌మ‌యంలో ఈ విష‌యం  అప్ప‌ట్లో ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కింది. అత‌డి చ‌ర్య‌ను చాలా మంది విమర్శించినప్పటికీ ప్రైస్ వాటిని తోసిపుచ్చారు. తన నిర్ణ‌యాలు త‌న సంస్థ ఎదుగుద‌ల‌కు ఎంత‌గా స‌హాయ‌ప‌డ్డాయో వివ‌రించారు. 

ప్ర‌జ‌లకు నీరు, ర‌వాణా, విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం ‘ఉచితాలు’ కాదు - సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ

‘‘ ఆరేళ్ల కిందట మా సిబ్బందికి వార్షిక వేతన 70 వేల డాలర్లుగా ప్రకటించినప్పటి నుంచి మా ఆదాయం మూడు రేట్లు పెరిగింది. హెడ్ కౌంట్ 70 శాతం పెరిగింది. కస్టమర్ బేస్ రెట్టింపు అయింది. మా సిబ్బందికి పిల్లలు 10 శాతం పెరిగారు. మా ఉద్యోగులు 70 శాతం రుణాలు చెల్లించారు. మా ఉద్యోగులు 10 శాతం ఇళ్లను కొనుగోలు చేశారు. 401 (k) కంట్రిబ్యూషన్లు 155 శాతం పెరిగాయి.’’ అని ఆయన చెప్పారు. తన కంపెనీ కూడా కరోనా ప్రభావాలను ఎదుర్కొంది. అయితే సంస్థలో తమకు ఎంత విలువ ఉందో తెలిసిన ఉద్యోగులు దాని మనుగడ కోసం పనిచేశారని ప్రైస్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios