వరల్డ్ రికార్డు సృష్టిస్తూ ఆఫ్రికన్ నటాబే మాచెట్ 127ఏళ్లు జీవించారు. సోమవారం మరణించిన ఆయన 127ఏళ్లు జీవించారని ఆయన మనవళ్లు చెబుతున్నారు. ఆయన జననాన్ని ధ్రువీకరించే పత్రాలను గిన్నిస్ బుక్ వాళ్లకు పంపారు. వారు ఈ పత్రాలను సమీక్షిస్తున్నారు. మాచెట్ ఎరిత్రియా దేశంలోని అజెఫా వాసి.
న్యూఢిల్లీ: మారుతున్న జీవన శైలి, నాగరికత విపరీతాలతో మనిషి ఆయుష్షు క్రమంగా ఆవిరైపోతున్నది. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు సహా మానసికంగా, శారీరకంగా బలహీనులుగా ఉంటున్న నేటి మనుషులు వందేళ్లు జీవించడమనేది కష్టసాధ్యమని చెప్పాల్సి వస్తున్నది. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి సెంచరీ దాటేసి 127ఏళ్లు జీవించాడనే వార్త సంభ్రమంతోపాటు ఆశ్చర్యాన్ని, ఆసక్తులను కలిగిస్తున్నది. ఆఫ్రికా దేశం ఎరిత్రియా నివాసి నటాబే మాచెట్ 127ఏళ్లు బతికారని ఆయన మనవళ్లు చెబుతున్నారు. నటాబే సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తాత రికార్డును ముందు తరాల కోసం రికార్డ్ చేసి పెట్టాలనే ఉబలాటంతో వరల్డ్ గిన్నిస్ రికార్డుల దరికిచేరారు.
ఆయన జనన ధ్రువీకరణ కోసం పత్రాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లకు నటాబే కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. చర్చి రికార్డుల ప్రకారం, నటాబే 1894 జన్మించినట్టు ఉన్నదని నటాబే కుటుంబీకులు చెబుతున్నారు. అయితే, ఆయన జన్మించిన పదేళ్ల తర్వాతనే బాప్తిజం తీసుకున్నారని వివరించారు. తన తాత 127 ఏళ్లు బతికాడని మనవళ్లు ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సమీక్షిస్తున్నది. అంతేకాదు, తన తాత అన్నేళ్లు జీవించడానికి గల కారణాలు వారు వివరించారు. సహనం, దాతృత్వం, సంతోషకరమైన జీవితమే నటాబే ఎక్కువ కాల బతకడానికి కారణాలని తెలిపారు.
తన తాత అసాధరమైన వ్యక్తి అని జీర్ అన్నారు. 1934లో నటాబే వివాహం చేసుకున్నారని వివరించారు. తన జీవితకాలం ఎక్కువభాగం పశువుల కాపరిగానే మిగిలిపోయాడు. 2014లో నటాబే 120వ యొక్క జన్మదిన్నాని ఊరంతా వేడకలు గడుపుకుంది. ప్రస్తుతం అత్యధిక కాలం జీవించిన రికార్డు హోల్డర్ జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ పేరిట ఉన్నది. ఆమె 1977లో 122 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పుడు గిన్నిస్ ప్రకారం, జపనీయుడు జిరోమోన్ కిమురా పేరిట ఉన్నది. 2013లో 116 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు.
