Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. థ్యాంక్స్ చెప్ప‌లేద‌ని పెద్ద గొడ‌వ‌.. ఒక‌రి హ‌త్య‌.. ఎక్క‌డ జ‌రిగిందంటే ?

థ్యాంక్స్ చెప్పలేదని మొదలైన గొడవ ఒకరి ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. 

There was a big fight about not saying thank you. Someone's murder. Incident in America
Author
First Published Sep 22, 2022, 11:02 AM IST

సాధార‌ణంగా మ‌నం ఎవ‌రికైనా ప‌నిలో సాయం చేస్తే థ్యాంక్స్ చెప్తారు. ఒక వేళ వారు అలా చెప్ప‌క‌పోయినా పెద్ద‌గా ఎవ‌రూ బాధ‌ప‌డరు. కానీ అంద‌రూ అలా ఉండ‌రు. కొంద‌రు చిన్న విష‌యాల‌కే మాన‌సికంగా కృంగిపోతారు. అవి త‌రువాత ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తాయో కూడా చెప్ప‌లేం. అమెరికాలో కూడా ఇలాగే జ‌రిగింది. థ్యాంక్స్ చెప్ప‌లేద‌ని అడిగినందుకు ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిని చంపేశాడు.

రూ.500 కోసం హత్య.. డ్రగ్స్ కొనుగోలు విషయంలో వివాదం, ముదిరి స్నేహితుడి హతం...

ఈ దారుణ ఘ‌ట‌న అమెరికాలో పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూలోని పార్క్ స్లోప్ కన్వీనియన్స్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ‘ఏబీసీ’ తెలిపిన వివరాల ప్రకారం.. బుధ‌వారం రాత్రి 10.20 గంటల సమయంలో ఓ వ్య‌క్తి బ్రూక్లిన్ స్మోక్ షాప్‌కి చేరుకున్నాడు. అత‌డి రాక‌ను గ‌మ‌నించిన ఆ షాప్ లో ప‌ని చేసే 37 ఏళ్ల అల్సైదీ డోరు తెరిచాడు. దీంతో అత‌డు లోప‌ల‌కు వ‌చ్చాడు. 

లక్ష రూపాయల కోసం అమ్మమ్మను చంపిన మనవడు

ఆ వ్య‌క్తితో ‘మీరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్ప‌కూడ‌దు ’ అని అడిగాడు. దీనికి అతడు సమాధానం ఇస్తూ.. ‘మిమ్మల్ని తలుపులు  ఎవ‌రు తీయ‌మ‌న్నారు. నేను అలా అడ‌గలేదు. కాబ‌ట్టి నేను థ్యాంక్స్ చెప్ప‌ను’ అని అన్నారు.  దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ వాగ్వాదం షాప్ బ‌య‌ట‌కు చేరుకుంది. ఈ  గొడ‌వ ముదిరిపోయింది. దీంతో బాధితుడు ‘నీకు చేతనైతే క‌త్తితో పొడిచి చంపు’ అని నిందితుడిని వెక్కిరించాడు. ఆ మాట‌ల‌తో రెచ్చిపోయిన ఆ వ్య‌క్తి త‌న సైకిల్ కు ఉన్న క‌త్తిని తీసుకొచ్చాడు. అల్సైదీ మెడ‌, కడుపై పొడిచాడు.

జాబ్ ప్రమోషన్ కోసం రికమెండ్ చేయలేదని బాస్ కుటుంబాన్ని హతమార్చిన ఉద్యోగి.. 8 ఏళ్ల తర్వాత అరెస్టు

దీంతో బాధితుడికి తీవ్ర ర‌క్త స్రావం జ‌రిగింది. గ‌ట్టిగా అర‌వ‌డం మొద‌లు పెట్టారు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు బాధితుడిని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథడిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే అత‌డు చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అరెస్టులూ జ‌ర‌గ‌లేదు. పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios