చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు సిటీల్లో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థులు మళ్లీ ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. 

చైనాలో మ‌ళ్లీ కోవిడ్ వ్యాప్తి మొద‌లైంది. దీనిని నివారించ‌డానికి అక్క‌డి ప్ర‌భుత్వం ముందుగానే లాక్ డౌన్ విధించింది. ఇది అనేక రంగాల‌పై ప్ర‌భావం చూపనుంది. దాదాపు ఆరున్న‌ర కోట్ల మంది ప్ర‌జ‌లు ఈ లాక్ డౌన్ వ‌ల్ల ఇబ్బంది ప‌డనున్నారు. కోవిడ్ -19 ప్రారంభ‌మైన నాటి నుంచి చైనాలో అనేక లౌక్ డౌన్ లు విధించారు. 

జింబాబ్వేలో మీజిల్స్ విలయతాండవం.. 700 మంది చిన్నారులు మృత్యువాత....!!

చైనాలో దక్షిణ నగరమైన చెంగ్డూలో కేసులు వ్యాప్తి చెంద‌డం ప్రారంభ‌మైంది. ఇక్క‌డ గ‌త వారం 157 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఈస్ట్ లో ఉండే నౌకా న‌గ‌రం టియాంజిన్లో కూడా ప‌ద్నాలుగు కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇలా కేసులు త‌క్కువ సంఖ్యలోనే న‌మోదు అవుతున్నా.. చైనాలో కోవిడ్ -19పై జీరో టాల‌రెన్స్ విధానం అవ‌ల‌భిస్తున్నారు. దీంతో మొద‌టి నుంచే ఈ కేసుల‌ను సీరియ‌స్ గా తీసుకుంటున్నారు. అందుకే కేసులు న‌మోదైన ప్రాంతాల్లో క్వారంటైన్ లు విధిస్తోంది. అలాగే ఎక్కడిక్క‌డ లౌక్ డౌన్ లు పెడుతున్నారు.

యూకే పీఎం రేసులో లిజ్ ట్రస్‌పై ఓడిన తర్వాత రిషి సునాక్ ఏమన్నాడంటే?

పెరుగుతున్న కోవిడ్ కేసుల వ‌ల్ల నైరుతి చైనాలోని దాదాపు రెండు కోట్ల మంది చెంగు సిటీలో నివ‌సించే ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. త్వ‌ర‌లో చైనాలో స్కూల్స్ కు సెల‌వులు రానున్నాయి. దీంతో ప్ర‌య‌ణాలు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఈ ప్ర‌యాణాల వ‌ల్ల మ‌ళ్లీ కేసులు విజృంభించే ప్ర‌మాదం ఉండ‌టంతో ముందుగానే లాక్ డౌన్ విధిస్తున్నామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది.

చైనాలో భారీ భూకంపం.. 46 మంది మృతి.. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రత

కాగా.. చైనాలో ముఖ్య‌మైన 30 సిటీల్లో ప్ర‌భుత్వం కోవిడ్ ఆంక్ష‌లు విధించిందని అక్క‌డికి మీడియా సంస్థ‌లు నివేదించాయి. అయితే వీటి వ‌ల్ల ట్రాన్స్ పోర్ట్ పై, ఎకానమీపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఈ లాక్ డౌన్ ఎంత కాలం పాటు ఉంటుంద‌నే విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం క్లారిటీ ఇవ్వ‌లేదు.