Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగం ఏంటో తెలుసా? వింటేనే నరాలు గడ్డకట్టుకుపోతాయి...

చేస్తున్న ఉద్యోగం కష్టం అనిపిస్తుందా? అలాంటి కష్టమైన ఉద్యోగం మీరు తప్ప, ఎవ్వరూ చేయలేరనుకుంటున్నారా? నిజంగా మీరు చేస్తున్న ఉద్యోగం కష్టమైనదేనా? అసలు ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగం ఉందా? ఉంటే అదేంటో తెలుసా? 

The hardest job in the world 'Vyomorozhka' - bsb
Author
First Published Feb 14, 2024, 11:01 AM IST

రష్యా : మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచును తొలగించడం... ఒక్కసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. దీన్నే వ్యోమోరోజ్కా అంటారు. అంటే 'ఫ్రీజింగ్ అవుట్'. మైనస్ 50 డిగ్రీలు అంటేనే సగం అర్థం అయ్యింది కదా.. ఇదే ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం. 

ఇప్పుడు రష్యా ఫార్ ఈస్ట్‌లో మంచుతో కప్పబడిన షిప్‌యార్డ్‌పై మంచును తొలగించేపనిలో ఉన్న కార్మికులు చేస్తున్న పని ఇదే. ఇక్కడ డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతుంది. ఈ కార్మికులు సైబీరియన్ ప్రాంతాల్లో నరాలు గడ్డకట్టించే చలిలో  శీతాకాలంలో హాల్కింగ్ వెసల్స్ ను నిర్వహించే భయంకరమైన పనిని చేస్తుంటారు. 

'ఫ్రీజింగ్ అవుట్' లేదా  వ్యోమోరోజ్కా అని పిలవబడే ఈ ఉద్యోగం.. ప్రపంచంలోని కొన్ని అత్యంత కఠినమైన పరిస్థితులలో, ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ (-58 F)కి పడిపోయి, బ్యాక్‌బ్రేకింగ్ కు వారాలు పట్టే సమయంలో చేయాల్సిన దుర్భరమైన పని. ఈ సమయంలో సముద్రంలో ఓడలు మంచుతో ముందుకు కదలవు. ఈ కార్మికులు ఓడలను చుట్టుముట్టిన మంచును తొలగిసతూ, ఓడకు మరమ్మత్తులు చేస్తారు. 

యూఏఈలో UPI, RuPay కార్డ్ సేవలు.. అట్టహాసంగా ప్రారంభించిన మోడీ, మొహమ్మద్ బిన్ జాయెద్ (వీడియో)

అందుకే రష్యాలోని అతిపెద్ద రిపబ్లిక్ యాకుటియాలోని స్థానికులు, ప్రపంచంలోని అత్యంత కష్టతరమైన ఉద్యోగాలలో ఒకటిగా దీన్ని చెబుతూ, దీనికి 'వైమోరోజ్కా' అని పేరు పెట్టారు. దీనిమీద కార్మికులు మాట్లాడుతూ.. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చలిని తట్టుకునే బందోబస్తు దుస్తులు ధరించాలి. ఆ తరువాత వేడి ప్రదేశానికి వచ్చి ఆ దుస్తులు విప్పితే ఒంట్లో నుంచి వచ్చే ఆవిర్లు.. ఆవిరి స్నానం లాగా ఉంటాయి. మీ చుట్టూ పొగలాగా ఆవిరి చుట్టుకుంటుంది అని మిఖాయిల్ క్లూస్ అనే 48 ఏళ్ల కార్మికుడు అన్నారు.

"ఇది కష్టతరమైన పని అని నేను అనుకోను - దాని కంటే కష్టతరమైన ఉద్యోగాలు ఉన్నాయి, కానీ బహుశా ఇది చాలా కష్టతరమైన ఉద్యోగాలలో ఒకటి. ఈ పనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, చలిని ప్రేమించడం, దానిలో పని చేయడం అవసరం.. అప్పుడే పని సులభం అవుతుంది" అన్నారు. పనికి సత్తువ, బలం మాత్రమే అవసరం, కానీ తీవ్ర ఖచ్చితత్వం కూడా అవసరం అన్నారు. 

కార్మికులు మంచును ఒకేసారి తొలగించొద్దు. తొందర తొందరగా కొట్టేయద్దు. పని చేసే సమయంలో మరి ఎక్కువ లోతుకు వెళ్లొద్దు. అలా చేస్తే ఓడ ముగినిపోతుంది. చెక్కిన డగౌట్ మునిగిపోతుంది, పని ఆగి పోతుంది. ప్రమాదకరంగా మారుతుంది. 

ఇక పనిచేసే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మంచు గడ్డకట్టడం మెరుగ్గా ఉంటుంది. పని చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే కొంతమంది కార్మికులపై ఉష్ణోగ్రతల ప్రభావం కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రభావం వల్ల కార్మికులు ప్రతికూల భావోద్వేగాలకు లోనవుతారు.. అని మరో కార్మికుడు చెప్పుకొచ్చాడు. 

ఎందుకంటే.. అంత చల్లటి వాతావరణం నుంచి ఇంటికి వెళ్లిపోవాలని.. మంచి భోజనం చేయాలని, విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంటుంది.. ఈ భావోద్వేగాలను అధిగమించాలి అని వారు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios