Asianet News TeluguAsianet News Telugu

స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఇప్పుడు కొత్త సమస్యలతో సతమతం..

అతడు ఓ డాక్టర్. స్పెర్మ్ డొనేషన్ చేస్తుండాడు. ఇప్పటి వరకు 550 మందికి తండ్రి అయ్యాడు. ఇంకా స్పెర్మ్ డొనేషన్ చేస్తూనే ఉన్నాడు. అయితే వీర్యదానం వల్ల ఎక్కువ మంది జన్మిస్తే.. భవిష్యత్ లో ఆ పిల్లలకు సమస్యలు వస్తాయని పేర్కొంటూ ఓ మహిళ కోర్టుకు వెళ్లారు. అతడు స్పెర్మ్ దానం చేయకుండా అడ్డుకోవాలని కోరారు.

The doctor who became the father of 550 people through sperm donation is now facing new problems.. ISR
Author
First Published Mar 29, 2023, 8:41 AM IST

స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన ఓ డాక్టర్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డాడు. అతడు ఇక నుంచి స్పెర్మ్ డొనేషన్ చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టుకు ఎక్కింది. అతడు సమృద్ధిగా వీర్య దానం చేయడం వల్ల అశ్లీల సంపర్కం వచ్చే ప్రమాదం ఉందని ఆరోపణలు చేస్తే ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆమె కూడా అతడి వీర్య దానం చేయడం వల్లనే బిడ్డకు జన్మనిచ్చింది.

కునో నేషనల్ పార్క్ లో చీతా మృతిపై రాజకీయ రగడ..అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎందుకు తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ విమర్శలు

నెదర్లాండ్స్ కు చెందిన  41 ఏళ్ల డాక్టర్ జోనాథన్ వీర్య దాతగా ప్రసిద్ధి చెందాడు. 2017 సంవత్సరంలో అతడు వీర్యదానం ద్వారా వంద మందికి పైగా తండ్రి అయ్యాడని వార్తలు వచ్చాయి. కాగా.. ఇప్పటి వరకు ఆయన ప్రపంచంలో ఉన్న 13 క్లినిక్ లలో వీర్యదానం చేశారు. దీని వల్ల 550 మంది పిల్లలు జన్మించారు. అయితే డచ్ స్పెర్మ్ క్లినిక్ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లల్లో సంతానోత్పత్తి, అశ్లీలత, మానసిక సమస్యలను నివారించడానికి ఒక స్పెర్మ్ డోనర్ గరిష్టంగా 25 మంది పిల్లలకు లేదా 12 మంది మహిళలకు వీర్యదానం చేయాలని చెబుతున్నాయి.

ఆ కుటుంబం పార్టీకి ఇరుసు లాంటిది.. పార్టీలో ఐక్యత ఆ కుటుంబంతోనే : అశోక్ గెహ్లాట్

ఈ నిబంధనలు ఆధారంగా చేసుకొని ఓ మహిళ కోర్టుకు వెళ్లారు. జోనాథన్ స్పెర్మ్ దానం చేయకుండా ఆపాలని కోరారు. అతడు పిల్లల సంఖ్య గురించి అబద్ధం చెబుతున్నాడని ఆరోపించారు. ‘‘అతడు అప్పటికే 100 మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చాడని నాకు తెలియదు. అలా తెలిస్తే నేను అతడి నుంచి వీర్య దానాన్ని స్వీకరించేదానిని కాదు. అతడి వల్ల నా బిడ్డకు భవిష్యత్ లో నా బిడ్డ ఎదుర్కొనే పరిణామాల గురించి తెలిస్తే నా కడుపు తరుక్కుపోతోంది’’ అని ఆమె తెలిపారు. క్లినిక్ లో ఉన్న అతడి స్పెర్మ్ నిల్వలను నాశనం చేయాలని ఆమె తన పిటిషన్ లో కోరారు.

రైలు పట్టాలపై పరుగులు పెట్టిన మహీంద్రా బొలెరో.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్.. అసలు దీని కథ ఏంటంటే ?

కాగా.. నెదర్లాండ్స్‌లోని పది వేర్వేరు క్లినిక్‌ల ద్వారా అతడు 102 మంది పిల్లలకు జన్మనిచ్చాడని వెలుగులోకి వచ్చిన తరువాత డచ్ గైనకాలజిస్ట్స్ అసోసియేషన్ అప్రమత్తం అయ్యింది. అతడిని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే అతడు డెన్మార్క్, ఉక్రెయిన్‌తో పాటు పలు దేశాల్లో స్పెర్మ్ దానం చేయడం కొనసాగించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios