థాయ్‌గుహ నుండి ఆరుగుర్ని బయటకు తీసిన రెస్క్యూ టీమ్

First Published 8, Jul 2018, 5:59 PM IST
Thailand cave rescue: Mission to save boys under way
Highlights

:థాయ్‌ గుహలో చిక్కుకొన్న 12 మంది సాకర్ ఆటగాళ్లు , ఒక కోచ్‌ను రక్షించే పనిని రెస్కూటీమ్ ప్రారంభించింది. ఇప్పటికే ఆరుగురు సాకర్ ఆటగాళ్లను గుహ నుండి బయటకు తీసుకొచ్చారు.


థాయ్‌లాండ్:థాయ్‌ గుహలో చిక్కుకొన్న 12 మంది సాకర్ ఆటగాళ్లు , ఒక కోచ్‌ను రక్షించే పనిని రెస్కూటీమ్ ప్రారంభించింది. ఇప్పటికే ఆరుగురు సాకర్ ఆటగాళ్లను గుహ నుండి బయటకు తీసుకొచ్చారు. థాయ్‌ రాయల్ నేవీ ఆద్వర్యంలో  రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. రెండు వారాలుగా గుహలోనే 12 మంది సాకర్ ఆటగాళ్లు, ఒక కోచ్ ఉన్నారు.


గుహలో నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో సాకర్ ఆటగాళ్లు చిక్కుకొన్నారు. వీరంతా గుహలోకి వెళ్లిన తర్వాత భారీగా వరద నీరు గుహలోకి చేరడంతో నాలుగు కి.మీ దూరం వరకు వీరంతా వరదలో కొట్టుకుపోయారు. 

థామ్ లుయాంగ్ కేవ్ లో చిక్కుకుపోయిన వారిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మరో మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని మొదట అనుకున్నారు. అయితే అత్యంత నైపుణ్యం కల రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ ను విజయవంతం చేశారు. ఇక గుహలో మిగిలింది మరో ఏడుగురు మాత్రమే.
 
రెండో విడత ఆపరేషన్ ప్రారంభించడానికి 10 నుంచి 20 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక, గుహ లోంచి బయటపడడానికి విద్యార్థులు పెద్ద సాహసమే చేశారు. రెస్క్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన తాడును పట్టు విడవకుండా పట్టుకుని ఒకరి వెంట ఒకరు ఈదుకుంటూ వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను మోస్తూ మలుపులు, ఎత్తుపల్లాలతో ఉన్న దారిలో నాలుగు కిలోమీటర్లకుపైగా ఈదుతూ బయటకు వచ్చారు. 

వీరికి ముందో డైవర్, వెనకవైపు ఓ డైవర్ వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఒడ్డుకు చేర్చారు. వారు ప్రయాణించిన మార్గంలో ఓ చోట వెడల్పు కేవలం 15 అంగుళాలు మాత్రమే ఉండడంతో విద్యార్థులు, రెస్క్యూ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అంతేకాదు, మరో చోట నీటి అడుగు నుంచి ఏకంగా కిలోమీటరు దూరం ఈదాల్సి వచ్చింది.
 
గుహలో ఉన్న మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు 13 మంది విదేశీ డైవర్లు, థాయ్ ఎలైట్ నేవీ సీల్‌కు చెందిన ఐదుగురు సిద్ధపడుతున్నారు.  బయటకు తీసుకొచ్చిన చిన్నారులను హెలికాప్టర్ ద్వారా సమీపంలోని చియాంగ్ రాయ్‌కు తీసుకెళ్లి  అక్కడి నుంచి అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

loader