అమెరికాలో ఆంధ్ర యువకుడు దుర్మరణం

Telugu youth dies in USA
Highlights

ఓ తెలుగు యువకుడు అమెరికాలో మృత్యువాత పడ్డాడు.

న్యూయార్క్: ఓ తెలుగు యువకుడు అమెరికాలో మృత్యువాత పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఆశిష్ పెనుగొండ కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్కులో పర్వతారోహణ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. 

దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు.  ఈ నెల 21న ఈ ప్రమాదం జరిగింది. ఆశిష్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి న్యూయార్క్‌లోని తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా "గో ఫండ్ మీ" అనే వెబ్ పేజ్ క్రియేట్ చేసి నిధులు సేకరిస్తున్నారు. 

ఇప్పటి వరకు 50వేల డాలర్లు సమీకరించినట్లు పేజ్ నిర్వాహకులు తెలిపారు. మృతుడు ఆశిష్ న్యూజెర్సీలోని సీమెన్స్ హెల్త్ కేర్ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

loader