అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Telugu Youth died in USA
Highlights

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు విద్యార్థి మరణించాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) అసువులు బాశాడు.

ఇండియానా: అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు విద్యార్థి మరణించాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) అసువులు బాశాడు. అనూప్‌ శుక్రవారం సాయంత్రం మిత్రులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. బోటింగ్ చేస్తున్న సమయంలో అతను అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. 

దీంతో తన స్నేహితులు 911కి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బంది సమాచారం అందించారు. సిబ్బంది రెండు రోజులపాటు అనూప్ కోసం గాలింపు చేపట్టారు. 

ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెస్కూ సిబ్బంది సోనార్‌ స్కానర్‌ ద్వారా మృతదేహాన్ని 15 అడుగుల లోతులో గుర్తించారు. 

అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన గో ఫండ్ మీ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనూప్ మృతికి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

loader