వాళ్లంతా తెలంగాణ మట్టి బిడ్డలు. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం, ఖండం కాని ఖండం పోయిర్రు. అయినా పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డను మరవలేకపోయిర్రు. ఎందుకు మర్చిపోతరు.. 60 ఏండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కదా? ఈ కొట్లాటలో వాళ్లూ పాలుపంచుకున్నరు. అమెరికాలో ఉండి కూడా తెలంగాణ కోసం కొట్లాడి పుట్టిన గడ్డ సత్తా చాటిర్రు. ఉద్యమ కాలంలో సీమాంధ్ర రాజకీయ నేతలు అమెరికా పోవాలంటే కూడా భయపడే పరిస్థితి కల్పించిర్రు. అక్కడ వారు కొట్లాడుతుంటే ఇక్కడ వాళ్ల తల్లిదండ్రులు, వాళ్ల దోస్తులు, చుట్టాలు కూడా తెలంగాణం  చేసిర్రు. ఉద్యమంలో మమేకమైర్రు. దీంతో అంతిమంగా తెలంగాణ వచ్చింది. ఆ ఆనందాన్ని ఏటా జరుకుంటున్నరు ప్రవాస తెలంగాణావాదులు. వేడుకల వీడియో కింద చూడండి.

"

అమెరికా లోని కొలంబస్ నగరం లో కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వేడుకలు మొదలు పెట్టారు. ఈ సంబురాల్లో తెలంగాన అట పాటలు అందరిని అలరించాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ ఆటలు , బోనాల నృత్యం అందరిని అలరించాయి. వెరైటీ ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. నేతన్న లు తయారుచేసినటువంటి కాటన్ దుస్తువులతో ఫ్యాషన్ షో నిర్వహించడం గర్వంగా ఉందని నిర్వాహకులు ఏషియానెట్ కు తెలిపారు. ఈ సంబరాలలో ప్రముఖ నటి ప్రజ్ఞా జైస్వాల్ , సింగర్ కౌసల్య , మిమిక్రి రమేష్  ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

ఈ సందర్భంగా సిటిఎఅధ్యక్షుడు మనోజ్ పోకల మాట్లాడుతూ  తెలంగాణ అభివృద్ధి లో ఎన్నారై లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు , కలలు సాకారం కావడానికి  ఎన్నారైలు  ముఖ్య భూమిక పోషించాలని కోరారు. ముఖ్య అతిధులు డబ్లిన్ మేయర్ స్టువర్ట్ హారిస్, వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు సభలో మాట్లాడారు.

రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము సాధించడములో ఎన్నారైలు ముఖ్యమైన పాత్ర పోషించారని అభినందించారు. దేశములోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని కొనియాడారు.

ఈ కార్యక్రమములో మనోజ్ పోకల  ,  శ్రీధర్ బిల్లకంటి , అమర్ మూలమళ్ళ , శ్రీకాంత్ గడ్డం,  అనిల్ వాది,  సాజిత్ దేశినేని , శ్రవణ్ చిదురుప్పశ్రీనివాస్ సలాండ్రి, శ్రీనివాస్ కొంపల్లి, అశోక్ ఎల్లందుల, రమేష్ మధు వెంకట్ తాళ్లపల్లి  , శ్రీనివాస్ ఆకుల విక్రమ్ ,శ్రావణి కారేపల్లి, మహేష్ పోకల , వేణు కంజర్ల రోహిత్, కమల్, రజినీకాంత్, వంశీ, రాధాకృష్ణ, భాస్కర్, మధునిక, వేణు పాల్గొన్నారు .