మేకకు, బొప్పాయి పండుకు కరోనా: కానీ, ట్విస్ట్ ఇదీ...
టాంజానియా: మేకకు, బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఇప్పటికే మనుషులతో పాటు పులులు, పిల్లులకు కూడ కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా కిట్లలో టెక్నికల్ సమస్యల కారణంగా తప్పుడు రిపోర్టులు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు
టాంజానియా: మేకకు, బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఇప్పటికే మనుషులతో పాటు పులులు, పిల్లులకు కూడ కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా కిట్లలో టెక్నికల్ సమస్యల కారణంగా తప్పుడు రిపోర్టులు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ కిట్లను వాడకాన్ని నిలిపివేయాలని టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుపులి ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచంలోని పలు దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. టాంజానియా దేశంలో కరోనా పరీక్షలు చేసేందుకు ఇతర దేశాల నుండి కిట్లను ఆ దేశం దిగుమతి చేసుకొంది. ఈ కిట్ల ద్వారా మనుషులు, మేక, గొర్రెలు, బొప్పాయి పండ్లపై కూడ పరీక్షలు నిర్వహించారు. గొర్రె మినహా మిగిలిన రెండింటికి వైరస్ సోకిట్టుగా తప్పుడు రిపోర్టులు వచ్చాయి. దీంతో ఈ కిట్స్ సరిగా లేవని నిపుణులు తేల్చి చెప్పారు.
also read:కిమ్ జంగ్ ఉన్ ఎక్కడికెళ్లినా రైల్లోనే: ట్రైన్ ప్రత్యేకత ఇదీ....
కరోనా టెస్టింగ్ కిట్స్‌లో సాంకేతిక లోపాల కారణంగానే తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఈ టెస్టింగ్ కిట్లను వాడొద్దని అధ్యక్షుడు జాన్ ఆదేశించారు. అంతేకాదు ఈ విషయమై దర్యాప్తు చేయాలని కూడ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కరోనా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో నాసిరకం కిట్ల వ్యవహారం బయటకు రావడంతో ప్రతిపక్షాలు ఒంటికాలిపై ప్రభుత్వం తీరును ఎండగడుతున్నాయి. టాంజానియాలో 480 కరోనా కేసులు నమోదైతే 17 మంది మృతి చెందారు.