ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్లను తాలిబన్ బలగాలు మట్టుపెట్టాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొంత కాలం కిందట కాబూల్‌లో జరిగిన ఉగ్రవాద నిరోధక దాడిలో వీరిద్దరూ హతమయ్యారని పేర్కొంది. 

కొన్ని రోజుల క్రితం రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద నిరోధక దాడిలో తమ భద్రతా దళాలు ఇద్దరు కీలక ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను హతమార్చాయని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు ఇంటెలిజెన్స్ చీఫ్, ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్ కేపీ) మాజీ యుద్ధ మంత్రి ఖారీ ఫతే అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.

చైనా ల్యాబ్ నుంచే కోవిడ్-19 వైరస్ లీక్.. అమెరికా ఎనర్జీ డిపార్టమెంట్ నిర్దారణ.. చైనా రియాక్షన్ ఏమిటంటే..?

ఐఎస్ కేపీ అనేది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘన్ అనుబంధ సంస్థ. కీలకమైన తాలిబాన్ విరోధిగా ఉంది. ఐఎస్ కేపీకి ఖారీ ఫతే ప్రధాన వ్యూహకర్త అని, కాబూల్లోని రష్యా, పాకిస్తాన్, చైనా దౌత్య కార్యాలయాలతో సహా అనేక దాడులకు కుట్ర పన్నాడని ముజాహిద్ చెప్పారు.

Scroll to load tweet…

ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్ (ఐఎస్ హెచ్ పీ) మొదటి ఎమిర్ గా పిలువబడే ఎజాజ్ అహ్మద్ అహంగర్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో ఐఎస్ కేపీ సీనియర్ నాయకుడు కూడా ఈ హత్యలను ధృవీకరించాడు. కాగా.. అబూ ఉస్మాన్ అల్ కాశ్మీరీగా పిలువబడే అహంగర్ ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్ లో జన్మించిన ఇతను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో రెండు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ లో వాంటెడ్ గా ఉన్నాడు.

2020 మార్చిలో కాబూల్ లోని గురుద్వారా కార్ట్-ఇ-పర్వాన్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డు, 24 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి దాడికి సూత్రధారి అహంగర్ అని ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అతడికి అల్ ఖైదా, ఇతర అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.