బుర్ఖా బ్యాన్ చేసిన దేశాల సరసన స్విట్జర్లాండ్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా
స్విట్జర్లాండ్ బుర్ఖాను బ్యాన్ చేయాలనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంటులోని ఎగువ, దిగువ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో త్వరలోనే చట్టం రూపం దాల్చనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీ: బుర్ఖా బ్యాన్ చేసిన దేశాల సరసన త్వరలో స్విట్లర్జాండ్ కూడా చేరబోతున్నది. స్విట్జర్లాండ్‌లోని రైట్ వింగ్, పాపులిస్ట్ ప్రభుత్వం బుర్ఖా బ్యాన్ చేస్తున్నది. ఇప్పటికే స్విట్జర్లాండ్ పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. బుర్ఖా లేదా ఇతర ఏదేని వస్త్రంతో ముఖాన్ని కప్పుకోవడాన్ని బ్యాన్ చేసే బిల్లును బుధవారం స్విట్జర్లాడ్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.
151-29 ఓట్లతో ఈ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం లభించింది. దిగువ సభలో ఇప్పటికే ఆమోదం పొందింది. రైట్ వింగ్ స్విస్ పీపుల్స్ పార్టీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సెంట్రిస్టులు, గ్రీన్లు వెల్లడించిన వ్యతిరేకతను వీరు అధగిమించారు.
రెండేళ్ల క్రితమే నిఖాబ్‌లు, బుర్ఖా, ఆందోళనకారులు ధరించే ఫేస్ కవరింగ్‌లను నిషేధించాలనే ఓ రెఫరెండమ్ తీసుకువచ్చారు. ఆ రెఫరెండమ్ స్వల్ప ఆధిక్యతతో పాస్ అయింది. తాజాగా పార్లమెంటులో పాస్ అయింది. త్వరలోనే ఇది ఫెడరల్ చట్టం రూపం దాల్చనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 1,000 ఫ్రాంక్‌లు(సుమారు రూ. 90 వేలు) జరిమానా విధించనుంది.
Also Read: కెనడాలో ఆ ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
బహిరంగ ప్రదేశాల్లో, అలగే, ప్రజలు వినియోగించుకునే ప్రైవేటు స్థలాల్లోనూ ఈ నిబంధన అమల్లో ఉండనుంది. ఇప్పటికే రెండు స్విస్ కాంటన్లు సౌతర్న్ టిసినో, నార్తర్న్ సెయింట్ గాలెన్‌లలో ఇలాంటి చట్టాలే అమల్లో ఉన్నాయి.
కాగా, స్విట్జర్లాండ్ తాజా బిల్లు ఆమోదం పొందితే ఇప్పటికే ఇలాంటి చర్యలే తీసుకున్న బెల్జియం, ఫ్రాన్స్ సరసన నిలుస్తుంది.