Asianet News TeluguAsianet News Telugu

2030 నాటికి 45 శాతానికి కార్భన్ తీవ్రత తగ్గించుకొంటాం: గ్లాస్గో సదస్సులో మోడీ

స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు రాత్రి ప్రసంగించారు.వాతావరణ మార్పులతో అభివృద్ది చెందుతున్న దేశాలకు  అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మార్పులు భారతదేశంలోని వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెద్ద సవాల్.

Support given to vulnerable countries needs to be global, says PM Modi
Author
Glasgow, First Published Nov 1, 2021, 9:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


గ్లాస్గో: 2030  నాటికి భారత దేశం 50 శాతం ఇంధన అవసరాలకు పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తోందన ప్రధాని Narendra Modi చెప్పారు.Scotland లోని Glasgowలో (ప్రపంచ వాతావరణ సదస్సు) cop 26 సదస్సులో  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు రాత్రి ప్రసంగించారు.
 

2070 నాటికి భారత్ నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకొంటుందన్నారు. భారతదేశం తన ఆర్ధిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను 2030 నాటికి 45 శాతానికి తగ్గించుకుంటుందని  ఆయన హామీ ఇచ్చారు.ఇప్పటి నుండి 2030 నాటికి భారత్ లో అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను ఒక బిలియన్ టన్నుల మేరకు తగ్గించనున్నట్టు మోడీ తెలిపారు.2030 నాటికి నాన్ ఫాసిల్ ఎనర్జీ సామర్ధాన్ని 500 గిగావాట్లకు ఇండియా చేరుకుంటుందన్నారు.

వాతావరణ మార్పులో జీవనశైలి ప్రధానపాత్ర పోషిస్తుందని ప్రపంచం నేడు అంగీకరిస్తుందని మోడీ చెప్పారు. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక పద ఉద్యమాన్ని ప్రతిపాదిస్తున్నానని ఆయన ప్రకటించారు. లైఫ్ అంలే పర్యావరణం కోసం జీవనశైలి.... ఈ అంశాన్ని మనమంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

ప్రపంచంలోని జనాభాలో ఇండియా 17 శాతం మందిని కలిగి ఉందని అయితే ఉద్గారాలలో కేవలం 5 శాతం మాత్రమే బాధ్యత వహిస్తుందని మోడీ చెప్పారు. కానీ నేడు ప్యారిస్ ఒప్పందాలను అక్షరబద్దంగా ఆచరించిన ఏకైక ఆర్ధిక వ్యవస్థ ఇండియా అని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందన్నారు.

తాగునీటి వనరుల నుండి గృహల వరకు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా అన్నింటిని తట్టుకొనేలా చేయాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు.ఇండియాలో అందరికీ కుళాయి నీరు, క్లీన్ ఇండియా మిషన్ , క్లీన్ కుకింగ్ ఇంధనం వంటి ప్రాజెక్టులు తమ దేశ ప్రజల పౌరులకు అనుకూల ప్రయోజనాలను అందించడమే కాకుండా వారి జీవన నాణ్యతను మరింత మెరుగుపర్చాయన్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించే సంప్రదాయ సమాజాల పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.రాబోయే తరానికి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్ లో వాతావరణ మార్పుల అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

బలహీన దేశాలకు అందించే మద్దతు ప్రపంచ వ్యాప్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. వాతావరణ మార్పులతో అభివృద్ది చెందుతున్న దేశాలకు  అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మార్పులు భారతదేశంలోని వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెద్ద సవాల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రైతులు పంటల విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అకాల వర్షాలు, వరదలు, తుఫానులతో పంటలు తరచుగా నాశనం అవుతున్నాయని మోడీ చెప్పారు.

తాగునీటి వనరుల నుండి గృహల వరకు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా అన్నింటిని తట్టుకొనేలా చేయాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు.ఇండియాలో అందరికీ కుళాయి నీరు, క్లీన్ ఇండియా మిషన్ , క్లీన్ కుకింగ్ ఇంధనం వంటి ప్రాజెక్టులు తమ దేశ ప్రజల పౌరులకు అనుకూల ప్రయోజనాలను అందించడమే కాకుండా వారి జీవన నాణ్యతను మరింత మెరుగుపర్చాయన్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించే సంప్రదాయ  పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.రాబోయే తరానికి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్ లో వాతావరణ మార్పుల అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

మోడీకి  భారతీయుల ఘన స్వాగతం

స్కాట్లాండ్‌లో  నివసిస్తున్న  భారతీయులు ప్రధాని  నరేంద్ర మోడీని కలిశారు.స్కాట్లాండ్‌లో నివసిస్తున్న భారతీయ సమాజానికి చెందిన ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత, స్కాట్లాండ్‌లోని భారతీయ కమ్యూనిటీ ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన అగ్రగామిగా ఆయన అభివర్ణించారు.

డాక్టర్ విపిన్: ప్రధాని మోదీని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను స్కాట్లాండ్‌లోని భారతదేశ ప్రవాసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, కానీ మనమందరం ప్రధాని మోదీని ఎంతోప్రేమిస్తున్నాం. అయినప్పటికీ, మనమందరం భారతదేశంలో నివసించడం లేదు, కానీ భారతదేశానికి సంబంధించిన అవకాశాలు, కలలు, అభివృద్ధి మరియు పురోగతి గురించి ఆలోచిస్తామన్నారు. ప్రధాని మోదీలో మనకు నాయకుడి ప్రతిరూపం కనిపిస్తుంది. మేము అతనిని ఇక్కడ కలుసుకున్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము. 

మంజూలిక: యోగా చాలా శతాబ్ద కాలం నుండి కొనసాగుతోంది, కానీ మోడీ వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు మోదీజీకి కృతజ్ఞతలు, ప్రపంచం దాని నుండి ప్రయోజనం పొందుతోంది. మానవుని మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులకు అతిపెద్ద అవసరం. ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి ఎక్కడా ఉండదు, అది యోగా ద్వారానే లభిస్తుంది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప భారతీయ నాయకుడు. వారికి మేము కృతజ్ఞులం. 

Support given to vulnerable countries needs to be global, says PM Modi

అనిల్: ప్రధాని మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఆయన్ను కలుసుకుని నేను ఆంధ్రావాసిని అని చెప్పినప్పుడు చాలా సంతోషించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షణలో దేశం పురోగమిస్తోందన్నారు. దేశం ఎదుగుతున్న తీరు చూస్తుంటే మనందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios