టర్కీ పార్లమెంటు వద్ద సమావేశాలు ప్రారంభానికి ముందు ఆత్మాహుతిదాడి, కాల్పులు.. ‘ఇది ఉగ్రదాడే’ (Video)
టర్కీ పార్లమెంటు వద్ద ఉగ్రదాడి జరిగింది. మరికొన్ని గంటల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ఈ దాడి జరిగింది. పార్లమెంటు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసుల కాల్పుల్లో మరో ఉగ్రవాది మణించాడు. ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. స్పాట్‌లో బాంబ్ స్క్వాడ్లు పని చేస్తున్నారు.
న్యూఢిల్లీ: టర్కీలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పార్లమెంటు సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సందర్భంలో పార్లమెంటుకు సమీపంలో ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. వెంటనే పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు స్పాట్‌కు చేరుకున్నాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. టర్కీ రాజధాని అంకారాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి స్పందించారు. ఆదివారం ఉదయం తన మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వివరించారు. మరో దుండగుడు పోలీసులు కాల్పులు మరణించాడని తెలిపారు. ఇది ఉగ్రవాదుల దాడే అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: భారత్‌కు మోస్ట్ వాంటెడ్, లష్కర్ టెర్రరిస్టు కైజర్ ఫరూఖ్ పాకిస్తాన్‌లో హతం.. వైరల్ వీడియో ఇదే
ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలు అయ్యాయని మంత్రి అలీ యెర్లికయా తెలిపారు. వేసవి విరామం తర్వాత మళ్లీ పార్లమెంటు సమావేశాలు ఈ రోజే ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ ఉగ్రదాడి జరిగింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు వచ్చి ఏరియాను అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు పెట్టారు. స్పాట్‌లో కొందరు బాంబ్ స్క్వాడ్లు ఉన్నట్టు టీవీ ఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. పార్కింగ్ ఏరియాలో ఉంచిన ఓ కారు వద్ద బాంబ్ స్క్వాడ్లు పని చేస్తున్నట్టు అందులో కనిపించారు.