చైనాలోని ఓ కిండర్ గార్టెన్ లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

చైనా : చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌ లో సోమవారం 25 ఏళ్ల వ్యక్తి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. లియాంజియాంగ్ కౌంటీలో జరిగిన దాడి కత్తిపోటు అని మీడియా పేర్కొంది. అనుమానితుడి ఇంటిపేరు వూ అని.. అతను లియాన్‌జియాంగ్‌కు చెందిన వ్యక్తి అని సమాచారం. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని మీద పోలీసులు వారు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దీనికి సంబంధించి ఇంకా ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు. బాధితుల్లో పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారని కొన్ని మీడియా పేర్కొంది. చైనాలో కఠినమైన తుపాకీ చట్టాలు , కట్టుదిట్టమైన భద్రత కారణంగా హింసాత్మక ఘటనలు చాలా అరుదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ-స్కూల్‌లలో అనేక కత్తిపోట్లు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

పేషెంట్‌తో నర్సు ఎఫైర్.. హాస్పిటల్‌లో సెక్స్ చేస్తుండగా మరణించిన పేషెంట్

గత ఏడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.2021లో, గ్వాంగ్జీలోని నైరుతి ప్రాంతంలోని కిండర్ గార్టెన్‌లో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి 16 మందిని గాయపరిచాడు.

తాజా ఘటన వైయాబీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో భావోద్వేగ చర్చకు దారితీసింది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

"అభం, శుభం తెలియని పిల్లలను ఇలా చేయడం దారుణం. దీని వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో... మరణశిక్షకు నేను మద్దతు ఇస్తున్నాను" అని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు 
పాఠశాలల్లో భద్రతను ప్రశ్నించారు, ప్రత్యేకించి ఇలాంటి ఘటనల మీద ప్రశ్నిస్తూ.."ఇలాంటి కేసులు ఇంకా ఎందుకు బయటపడుతున్నాయి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.