వారెవ్వా.. మాంసాహార బియ్యం రెడీ.. ఎన్ని పోషకాలో..
దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు (South Korean scientists) కొత్త రకమైన ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశారు. మాంసాహార బియ్యాన్ని (meaty rice) కనుగొన్నారు. దీని ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చాలా తక్కువ హాని ఉంటుంది.
పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందించడానికి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఒక కొత్త ఉపాయాన్ని కనుగొన్నారు. యోన్సీ యూనివర్సిటీకి చెందిన బయోమాలిక్యులర్ ఇంజనీర్ సోహియోన్ పార్క్ నేతృత్వంలో జరిగిన ఓ పరిశోధనలో మాంసాహార బియ్యాన్ని ఉత్పత్తి చేశారు. ఈ పరిశోధన సారాంశం జర్నల్ లో ప్రచురితమైంది.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
ఈ మాంసాహార బియ్యంలో మాంసం ముక్కలు, బియ్యం వింత కలయికలా కనిపిస్తుంది. కానీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సెల్ కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుండి మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. దీని ఉత్పత్తి కొంచెం శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ.. భవిష్యత్ లో ఇది ఆహార ఒత్తిడిని తగ్గిస్తుందని పరిశోధనా బృందం తెలిపింది.
ఈ మాంసాహార బియ్యంలో అధికంగా ప్రోటీన్, 8 శాతం కొవ్వు కంటెంట్ ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగించదు. అయితే సాధారణ మాంసాహార ఉత్పత్తితో పోలిస్తే ఖర్చుతో కూడుకున్నదని పరిశోధకులు తెలిపారు. ఈ మాంసాహార ధాన్యం వల్ల ప్రపంచంలో భవిష్యత్ లో కరువు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సైనికులకు, అంతరిక్ష వ్యోమగాములకు ఈ ఆహారం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.