Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయెల్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు

ఇజ్రాయెల్‌ లోని జెరూసలేం శివార్లలో ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో ఘోరమైన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. 

Shooting in Israel Seven dead, 10 injured
Author
First Published Jan 28, 2023, 9:06 AM IST

ఇజ్రాయెల్‌ లోని జెరూసలేం శివార్ల ఉన్న సినాగోగ్‌లో శుక్రవారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ఘటనలో ఐదుగురే మరణించారని, మరో ఐదుగురికి గాయాలయ్యాయని, అందులో 70 ఏళ్ల మహిళ కూడా ఉన్నారని ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. క్షతగాత్రులు అంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

వార్నీ.. సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్థరాత్రి పడుకుంటే దగ్గరికి వచ్చి..

ఇజ్రాయెల్ పోలీసులు దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఇది జెరూసలేం లోపల పొరుగు ప్రాంతంగా ఇజ్రాయెలీలు భావించే నెవే యాకోవ్ లోని ప్రార్థనా మందిరంలో జరిగింది. అయితే పాలస్తీనియన్లు, అంతర్జాతీయ సమాజం 1967 మధ్యప్రాచ్య యుద్ధం తరువాత చట్టవిరుద్ధంగా దీనిని ఆక్రమించిందని భావిస్తున్నారు.

గత కొన్నేళ్లలో వెస్ట్ బ్యాంక్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం యూదు సబ్బాత్ రోజున జరగడం గమనార్హం. గాజాలో, హమాస్ అధికార ప్రతినిధి హజీమ్ ఖాసిం రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ‘‘ ఈ ఆపరేషన్ జెనిన్ లో ఆక్రమణ చేసిన నేరానికి ప్రతిస్పందన. నేరపూరిత చర్యలకు సహజమైన ప్రతిస్పందన’’ అని పేర్కొన్నారు. కాగా.. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కూడా ఈ దాడిని ప్రశంసించింది కానీ తామే చేశామని క్లెయిమ్ చేయలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios