టెక్సాస్‌లోని ఎల్ పాసో షాపింగ్ మాల్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

టెక్సాస్‌ : టెక్సాస్‌లోని ఎల్ పాసోలోని సిలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల మీద కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని రాయిటర్స్ తెలిపింది. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

"ఒక వ్యక్తి మా కస్టడీలో ఉన్నాడు. మరో వ్యక్తి కూడా కాల్పులకు బాధ్యుడై ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతం మాల్‌లో బాగా వెతుకుతున్నాం’’ అని పోలీసు ప్రతినిధి రాబర్ట్ గోమెజ్ చెప్పారు. కాల్పులు ఎందుకు జరిగాయో.. ఉద్దేశ్యాన్ని పోలీసులు ఏమీ తెలుపలేదు. ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎప్పుటికప్పుడు ట్విట్టర్లో వివరాలు ప్రజలతో పంచుకున్నారు. "సీలో విస్టా మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో కాల్పులు జరిగాయి. దీనిమీద పోలీసులు స్పందిస్తున్నారు, ఇంకా ఇక్కడ పరిస్తితులు అదుపులోకి రాలేదు. కాబట్టి.. ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని ఎల్ పాసో పోలీసులు ట్వీట్‌లో తెలిపారు.

ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన విద్యార్థులు.. వీడియో వైరల్...!

ఆ తరువాత మరో ట్వీట్ లో "మాల్ సీన్ ఇంకా యాక్టివ్‌గా ఉంది, దయచేసి ఆ ప్రాంతానికి వెళ్లకండి. ఈ ప్రాంతంలో రెస్క్యూకు అనేక ఏజెన్సీలు ముందుకువస్తున్నాయి" అని మరొక ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం ఘటన జరిగిన మాల్ వాల్‌మార్ట్‌కు ఆనుకుని ఉంది, ఇక్కడ 2019లో జరిగిన సామూహిక కాల్పుల్లో 23 మంది మరణించారు. దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. మాల్ ఫుడ్ కోర్ట్, డిల్లార్డ్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు వచ్చిన నివేదికలకు ప్రతిస్పందనగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను సాయంత్రం 5 గంటల తర్వాత మాల్‌కు పిలిచినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు రెండో వార్తా సమావేశాన్ని నిర్వహిస్తామని ఎల్ పాసో పోలీసులు తెలిపారు.

మాల్‌లో ప్రత్యక్ష సాక్షి అయిన రాబర్ట్ గొంజాలెజ్ మాట్లాడుతూ, "బయటికి వెళ్లడానికి ప్రజలు పరుగులు తీయడం నేను చూశాను" అని చెప్పారు. అంతేకాదు.. తాను తన కారును సురక్షితంగా చేరుకోగలిగానని చెప్పాడు. గొంజాలెజ్ తీసిన వీడియోలలో అనేక మాల్ స్టోర్ షాపులు మూసివేయబడ్డాయి. వాటి భద్రతా గేట్లు కిందికి లాగి, వాటిముందు పోలీసులు ఉండడం కనిపిస్తుంది.