ఆ పెంపుడు కుక్క పొరపాటున బురద కాలువలో పడిపోయింది. యజమాని దానిని కాపాడటానికి సహాయం కోరగా... కొందరు విద్యార్థులు ముందుకు వచ్చారు.
జంతు ప్రేమికులు మనలో చాలా మందే ఉన్నారు. రోడ్డు మీద జంతువులు గాయపడినా, ఇబ్బంది పడుతున్నట్లు కనిపించినా... చాలా మంది చూస్తూ ఊరుకోలేరు. తమ వంతు సహాయం చేసి రక్షించాలని అనుకుంటారు. తాజాగా.... కొందరు విద్యార్థులు కూడా అదే చేశారు. బురద కాలువలో చిక్కుకున్న కుక్కను చాలా సాహసం చేసి మరీ రక్షించారు. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో కొంతమంది ధైర్యవంతులైన విద్యార్థులు కష్టపడి బురద కాలువలో చిక్కుకున్న కుక్కను కాపాడారు. నిజానికి అది స్ట్రీట్ డాగ్ కాదు. ఎవరో దానిని పెంచుకుంటున్నారు. అయితే.. ఆ పెంపుడు కుక్క పొరపాటున బురద కాలువలో పడిపోయింది. యజమాని దానిని కాపాడటానికి సహాయం కోరగా... కొందరు విద్యార్థులు ముందుకు వచ్చారు. ఇద్దరు 20 ఏళ్ల కుర్రాళ్లు, జాక్ స్పెన్సర్ ఫర్మ్‌స్టన్ , బెన్ కాంఫోర్ లు కుక్కను రక్షించడానికి సహాయం చేశారు.
దానిని కాపాడటానికి యువకుల్లో ఒకరు తలకిందులుగా వేలాడటం గమనార్హం. కొంచెం మిస్ అయినా... ఆ యువకుడు కూడా బురదలో పడిపోయే అవకాశం ఉంది. కానీ... కుక్క కోసం తన ప్రాణాలకు తెగించి మరీ అరుదైన ఫీట్ ఛేసి మరీ.... కుక్కను బయటకు తీశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారగా... వారు చేసిన సాహసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆ యువకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
