Asianet News TeluguAsianet News Telugu

అట్లాంటా హాస్పిటల్‌లో కాల్పులు... ఒకరు మృతి, 4 గురికి గాయాలు.. నిందితుడి అరెస్ట్

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అట్లాంటాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. 

Shooting At Atlanta Hospital, One Dead, Four Injured, accused Arrested - bsb
Author
First Published May 4, 2023, 9:24 AM IST

అట్లాంటా : అమెరికాలోని అట్లాంటాలో ఓ మెడికల్ బిల్డింగ్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఓ సాయుధుడైన అగంతకుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ వరుసగా ట్వీట్లు చేసింది. నిందితుడిని 24 ఏళ్ల డియోన్ ప్యాటర్సన్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత కొన్ని  గంటల అనంతరం అతడిని అరెస్టు చేశారు.

సీసీటీవీ ఫుటేజీలో అతడు చేతిలో తుపాకీతో కనిపించాడని, ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ఓ వాహనాన్ని ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన ప్యాటర్సన్, మాజీ యూఎస్ కోస్ట్ గార్డ్స్‌మన్ అని తెలిపారు. అతడిని నార్త్‌సైడ్ మెడికల్‌ బిల్డింగ్ లో కాల్పులు జరిపిన చాలాసేపటికి నగరానికి ఉత్తరాన సబర్బన్ కాబ్ కౌంటీలో అదుపులోకి తీసుకున్నారు.

బాధితులంతా మహిళలేనని, ఆసుపత్రిలోని వెయిటింగ్ రూమ్‌లో కాల్పులు జరిగాయని పోలీసు చీఫ్ డారిన్ షియర్‌బామ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే, ఆ గదిలో కాల్పులు జరిపిన వ్యక్తి తల్లి కూడా ఉందని, అయితే కాల్పుల్లో ఆమె గాయపడలేదని తెలిపారు. కాల్పుల అనంతరం స్థానికులను అప్రమత్తం చేయడానికి అట్లాంటా పోలీసులు నిందితుడైన ప్యాటర్సన్ నాలుగు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతను బిల్డింగ్ లోకి ఎంట్రెన్స్ గుండా రావడం... నడుస్తూ, చేతిలోని తుపాకీని చూపించడానికి చేయి పైకి లేపడం ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. అయితే, అతని లక్ష్యం ఏంటో అందులో తెలియడం లేదు. 

క్రెమ్లిన్‌పై దాడి రష్యాను రెచ్చగొట్టడమే, మాకే ప్రమాదం .. మాస్కో ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్

కాల్పుల్లో బాధితులైన ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా, నాల్గవ వ్యక్తి మరణించినట్లు ప్రకటించారు. నిందితుడిని డియోన్ ప్యాటర్సన్‌గా పోలీసులు గుర్తించారు, అతను ఇంకా పరారీలో ఉన్నాడు. తాము అధికారులకు సహకరిస్తున్నామని నార్త్‌సైడ్ హాస్పిటల్ ఒక ట్వీట్‌లో తెలిపింది.

అట్లాంటా మేయర్ ఆండ్రీ డికెన్స్ ఒక ట్వీట్‌లో మాట్లాడుతూ, తాను పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నానని,  ఆ ప్రాంతంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. "నేను అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎలాంటి అనుమానిత పరిస్థితి కనిపించినా పోలీసులను స్థలంలో ఆశ్రయించాలి" అని చెప్పాడు. అట్లాంటా పబ్లిక్ స్కూల్స్‌లోని అనేక అనుబంధ పాఠశాలలను "ముందు జాగ్రత్తతో" తాత్కాలికంగా మూసివేసినట్లు మీడియా తెలుపుతోంది. 

తుపాకీ హింస ఆర్కైవ్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు 180 కంటే ఎక్కువ సామూహిక కాల్పులు జరిగాయి -- నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారు. చనిపోయారు. దేశ జనాభా కంటే ఎక్కువగా ఉన్న తుపాకీల సంఖ్యతో, యునైటెడ్ స్టేట్స్ ఏ అభివృద్ధి చెందిన దేశం కంటే తుపాకీ సంబంధిత మరణాల రేటులో ముందు ఉంది. 2021లో 49,000, అంతకు ముందు సంవత్సరం 45,000 మంది ఇలా మరణించిన వారిలో ఉన్నారు.

అట్లాంటా కాల్పులపై అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లకు సమాచారం అందించామని వైట్‌హౌస్ తెలిపింది. అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ, "సమాజంలో, పాఠశాలలు, చర్చిలలో మనం చూస్తున్న హింసను ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు" తీసుకోవాల్సిన అవసరం ఉందని "అమెరికన్ ప్రజలు కిరాణా దుకాణానికి, చర్చికి వెళ్లడానికి సంకోచించే పరిస్థితి ఉండకూడదు" అని జీన్-పియర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios