Asianet News TeluguAsianet News Telugu

UAE: యూఏఈ కొత్త అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్.. !

United Arab Emirates: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నూత‌న  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయ‌న‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఎన్నుకున్నట్లు యూఏఈ మీడియా పేర్కొంది.
 

Sheikh Mohamed Bin Zayed Elected UAE President: State Media
Author
Hyderabad, First Published May 14, 2022, 6:47 PM IST

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ఆ దేశ సుప్రీం కౌన్సిల్ ప్రకటించింది. అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటించారు. షేక్ మొహమ్మద్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడ్డారని ఆ దేశ మీడియా పేర్కొంది. మాజీ అధ్య‌క్షుడి సోదరుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (61) దేశానికి మూడో అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు.  ఆయన 2004 నుంచి అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌గా పని చేసిన షేక్‌ మొహమ్మద్‌ అబుదాబికి 17వ పాలకుడిగా పని చేయనున్నారు. 

యూఏఈ మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్త అధ్యక్షుడు మళ్లీ ఎన్నికకు అర్హత సాధించడానికి ముందు ఐదేళ్ల పదవీకాలం కోసం పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్‌, ప్రధాన మంత్రి, దుబాయి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించగా.. యూఏఈ పాలకులు హాజరయ్యారు. కాగా,  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ జనవరి 2005 నుంచి యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్‌గా కొన‌సాగుతున్నారు. ఈయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. వ్యూహాత్మక ప్రణాళిక, శిక్షణ, సంస్థాగత నిర్మాణం, రక్షణ సామర్థ్యాలను ప్రోత్సహించడంలో యూఏఈ సాయుధ దళాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర ఆయ‌న పోషించారు.

కాగా, యూఏఈ అధ్యక్షుడు (uae president) షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa Bin Zayed Al Nahyan) శుక్ర‌వారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. నవంబర్ 3, 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. నహ్యాన్ మరణం నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు సహా ప్రైవేట్ రంగంలో దాదాపు 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అలాగే మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది.  తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1948లో జన్మించిన షేక్‌ ఖలీఫా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. 

తన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో (Mohammed bin Zayed) కలిసి నహ్యాన్ రోజువారీ పాలనా వ్యవహారాల్లో చాలా రోజులుగా కనిపించడం మానేశారు. ఆయ‌న మ‌ర‌ణంతో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నూత‌న  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయ‌న‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ Sheikh Mohamed Bin Zayed ను ఎన్నుకున్నట్లు యూఏఈ మీడియా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios