సారీ ఇవాంకా! తప్పే చేశాను: సమంత క్షమాపణ

సారీ ఇవాంకా! తప్పే చేశాను: సమంత క్షమాపణ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ నకు టీవీ యాంకర్ సమంత బీ ఎట్టకేలకు క్ష,మాపణలు చెప్పారు.  కమెడియన్‌ కమ్‌ టీవీ హోస్ట్‌ సమంత బీ ఫుల్‌ ఫ్రంటల్‌ అనే షోలో ఇవాంకాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది తీవ్రమైన వివాదానికి దారి తీసింది

ఆ వ్యాఖ్యలపై  వైట్‌హౌజ్‌ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాంకకు సమంత బీ సారీ చెప్పేశారు. "ఇవాంక ట్రంప్‌నకు, ఆ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు నా క్షమాపణలు. ఆమెపై గత రాత్రి నేను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. అనవసరంగా మాట్లాడాను. హద్దులు మీరాను" అని సమంత అన్నారు . 

"అందుకు చింతిస్తున్నా. ఇవాంక నన్ను మన్నించండి" అని ఓ ప్రకటనలో సమంత తెలిపారు. తన ట్విటర్‌లో ఆమె ట్వీట్‌ కూడా చేశారు. 

ఇటీవల ఇవాంక తన చిన్న కుమారుడితో దిగిన ఓ ఫోటోను ట్వీట్‌ చేశారు. అదే సమయంలో అమెరికాలో 1500 మంది వలసవాద చిన్నారులు అదృశ్యం అయ్యారనే నివేదిక ఒకటి వెలువడింది. బుధవారం తన టీవీ షోలో సమంత బీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ - యూఎస్‌ ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్‌ వలసవాదుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాని వ్యాఖ్యానించారు.

తన తండ్రికి (ట్రంప్‌) సలహాలు ఇవ్వాలని ఇవాంకాకు సూచిస్తూ కుమారుడితో ఉన్న ఫోటోను ప్రస్తావించారు. అలాంటి పరిస్థితి మీకు వస్తే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వైట్‌హౌజ్‌ ప్రెస్‌ కార్యదర్శి సారా హుక్కాబీ సాండర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

టీబీఎస్‌ నెట్‌వర్క్‌ ఆ కార్యక్రమం తాలూకూ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుపుతూ వైట్‌హౌస్ కార్యాలయాన్ని క్షమాపణలు కోరింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page