Asianet News TeluguAsianet News Telugu

రష్యా అధ్యక్ష ఎన్నికలు: పుతిన్ విజయం

రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.

 Russia: Vladimir Putin wins 87% of vote lns
Author
First Published Mar 18, 2024, 9:59 AM IST | Last Updated Mar 18, 2024, 10:04 AM IST

మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో  వ్లాదిమిర్ పుతిన్  విజయం సాధించారు.పుతిన్ కు వ్యతిరేకంగా  ఆయన ప్రత్యర్థులు  పోలింగ్ స్టేషన్ల మధ్య నిరసనలు చేపట్టారు.  1999లో  తొలిసారిగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

also read:ఈడీ అరెస్ట్: సుప్రీంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్

 గతంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా  జోసెఫ్ స్టాలిన్  అత్యధిక కాలం పనిచేసిన నేతగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం  పుతిన్  వరుసగా విజయాలు సాధిస్తున్నాడు.పుతిన్ కు 87.88 శాతం ఓట్లు దక్కినట్టుగా  ఫలితాలు తెలుపుతున్నాయి.  

also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

కమ్యూనిస్టు అభ్యర్ధి నికోలాయ్ ఖరిటోనోవ్  కు 4 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పుతిన్ తర్వాతి స్థానంలో  కమ్యూనిస్టు అభ్యర్ధి నిలిచారు.  వ్లాడిస్లావ్ దావన్కోవ్  మూడో స్థానంలో నిలిచారు. అల్ట్రా నేషనలిస్ట్  కు చెందిన లియోనిడ్ స్లట్క్సీ నాలుగోస్థానంలో నిలించారు.రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  రష్యన్ మిలటరీని మరింత బలోపేతం చేస్తానని  పుతిన్ తన మద్దతుదారుల సమావేశంలో పేర్కొన్నారు.

also read:హృతిక్ రోషన్ పాటకు జంట డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరల్

మన ముందు అనేక పనులున్నాయి... కానీ మనం ఏకమైన సమయంలో మనల్ని ఎవరూ భయపెట్టాలని, అణచి వేయాలని కోరుకున్నా చరిత్రలో విజయం సాధించలేరన్నారు.గత నెలలో ఆర్కిటిక్ జైలులో  రష్యా విపక్ష నేత  అలెక్సీ నావల్నీ అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు.  నావల్నీ మద్దతుదారులు  ఆదివారంనాడు  పలు పోలింగ్ స్టేషన్ల వద్ద నిరసనకు దిగారు.రష్యా అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించినట్టుగా ఆదివారంనాడు పుతిన్ మీడియాకు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios