కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
కూరగాయల మాదిరిగా నూడుల్స్ ను వీధుల్లో విక్రయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ నూడుల్స్ గా మ్యాగీ ప్రసిద్ది చెందింది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. వీది బండిపై ఓ వ్యక్తి పొడి పొడి మ్యాగీ నూడుల్స్ ను విక్రయిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.
also read:37 కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవుల భర్తీ: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
కూరగాయలు,పండ్లు, వేరుశనగలను వీధి బండ్లపై విక్రయిస్తుంటారు. అయితే ఈ తరహాలో మ్యాగీని విక్రయించడం తొలిసారిగా చెబుతున్నారు.ఈ వీడియో 41 మిలియన్లకు పైగా మంది వీక్షించారు.
also read:క్లాస్‌రూమ్‌లో టీచర్ డ్యాన్స్: వీడియో వైరల్
ఇన్‌స్టాగ్రామ్ లో ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేశారు. నూడుల్స్ తో పాటు మసాలా పాకెట్లను కూడ విక్రయిస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే వీధి బండిపై నూడుల్స్ ను విక్రయించడంతో దుమ్ము రుచి ఉచితమని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. వీధి బండిపై నూడుల్స్ విక్రయించే ఆలోచనను ఓ నెటిజన్ ప్రశ్నించారు.
కూరగాయల తరహాలో నూడుల్స్ విక్రయం కొత్త తరహలో ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నూడుల్స్ ను వీధుల్లో విక్రయించాలని వ్యాపారి ఆలోచనపై కొందరు అభినందిస్తున్నారు.