ఉక్రెయిన్ పై రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ యూన్ భద్రతా మండలి తీర్మాణాన్ని ఆమోదించింది. అయితే ఈ తీర్మాణాన్ని రష్యా వీటో చేసింది. భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది. త్వరలోనే మళ్లీ ఈ తీర్మాణాన్ని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

రష్యా ఊహించినట్లుగానే ఉక్రెయిన్‌పై ఆ దేశ దూకుడు చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్టు ఐక్య‌రాజ్యస‌మితి భ‌ద్ర‌తా మండ‌లి తీర్మాణం చేసింది. ఈ తీర్మాణంపై కౌన్సిల్ లో ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే భార‌త్, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్ దూరంగా ఉన్నాయి. ఐక్య రాజ్య స‌మితి చేసిన ఈ తీర్మాణాన్ని ర‌ష్యా వీటో చేసింది. 

ఐక్య రాజ్య స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు క‌లిసి ర‌ష్యా కు ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దానికి వ్య‌తిరేకంగా తీర్మాణాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మాణాన్ని భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్యులుగా ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు ఆమోదించాయి. వెంట‌నే ఉక్రెయిన్ నుంచి ర‌ష్యా ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశాయి. ర‌ష్యాతో భార‌త్ కు ఉన్న సంబంధాల కార‌ణంగా మ‌న దేశం ఈ ఓటింగ్ అనుకూలంగా గానీ, వ్య‌తిరేకంగానే ఓటు వేయ‌లేదు. త‌ట‌స్థంగా నిల‌బ‌డి ఓటింగ్ దూరంగా ఉంది. భార‌త్ పాటు చైనా, యూఏఈలు కూడా ఓటింగ్ లో పాల్గొన‌లేదు. భ‌ద్ర‌తా మండ‌లిలో ఈ ఓటింగ్ భారీ మెజారిటీతో ఆమోదం పొందినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఎందుకంటే ర‌ష్యా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. 

ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో రష్యా శాశ్వ‌త స‌భ్యదేశంగా ఉంది. ఈ దేశానికి వీటో అధికారం ఉంటుంది. అంటే ఈ మండలిలో ఆమోదించిన అంశాల‌ను ఆ వీటో అధికారంతో ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఉక్రెయిన్ పై చేస్తున్న దాడికి వ్య‌తిరేకంగా మండ‌లి తీర్మాణాన్ని ఆమోదించిన త‌న అధికారంతో దానిని వీటో చేసింది. ఈ తీర్మాణం ఆమోదం పొందినా ర‌ష్యా ఇలా చేస్తుంద‌ని అమెరికాతో స‌హా అన్ని దేశాల‌కు తెలుసు. అయిన‌ప్ప‌టికీ భ‌ద్ర‌తా మండ‌లిలో అధికారికంగా చేప‌ట్టే ఈ తీర్మాణం కొంత వ‌ర‌కు ర‌ష్యాపై ఒత్తిడి తీసుకురావ‌చ్చ‌ని అంద‌రూ భావించారు. ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడిని ప్రారంభించాల‌నే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయాన్ని ఖండించడానికి చ‌ర్చించ‌డానికి, వ్య‌తిరేకించ‌డానికి ఒక అవ‌కాశాన్ని ఈ వేదిక అందించింది. 

ఈ ఓటింగ్ అనంత‌రం UNలోని US రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పనివ్వండి.. రష్యా, మీరు ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు, కానీ మీరు మా గొంతులను వీటో చేయలేరు. మీరు సత్యాన్ని వీటో చేయలేరు. మీరు మా సూత్రాలను వీటో చేయలేరు. మీరు ఉక్రేనియన్ ప్రజలను వీటో చేయలేరు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మాకు గంభీరమైన బాధ్యత ఉంది.కనీసం అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది’’ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా అయితే ర‌ష్యా విస్తృత UN జనరల్ అసెంబ్లీ ముందు ఇదే విధమైన తీర్మానంపై ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. 

ఉక్రెయిన్ పై రష్యా తీసుకుంటున్న చ‌ర్య‌ల నేప‌థ్యంలో యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లిని శుక్ర‌వారం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌ప‌ర్చాల‌ని అమెరికా కోరింది. ఈ క్ర‌మంలోనే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ తీర్మాణానికి త‌మ‌కు అన‌కూలంగా ఓటు వేయాల‌ని భార‌త్ ను ర‌ష్యా కోరింది. కానీ అటు అనుకూలంగా గానీ, వ్య‌తిరేకంగా గానీ ఓటు వేయకుండా భార‌త్ త‌ట‌స్థంగా నిల‌బడింది.