విదేశీ టెక్‌ కంపెనీలకు రష్యా ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google).. ఏకంగా..  7.2 బిలియన్ రూబిళ్లు ($98 మిలియన్ డాలర్లు, 86 మిలియన్ యూరోలు) జరిమానా విధించింది ర‌ష్యా ప్ర‌భుత్వం.  అలాగే Meta (Facebook), Twitter, Google మరియు ఇతర విదేశీ టెక్ దిగ్గజాలపై కూడా ఆంక్షాలు విధిస్తోంది.  

 అమెరికా టెక్ కంపెనీల‌పై రష్యా తీవ్ర ఒత్తిడి చేస్తోంది..ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google).. కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ .. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది యూజర్లను సొంతం చేసుకుంది. అలాంటి Google కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. ఇటీవల గూగుల్, ఇత‌ర టెక్ కంపెనీలపై నిషేధించిన కంటెంట్‌ను తొలగించనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంది

 గూగుల్ త‌న కంటెంట్‌ను సరిగ్గా నియంత్రించడంలో, చట్ట విరుద్ధంగా భావించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైంద‌నే ఆరోప‌ణ‌ల‌తో ఏకంగా.. 7.2 బిలియన్ రూబిళ్లు ($98 మిలియన్ డాలర్లు, 86 మిలియన్ యూరోలు) జరిమానా విధించింది. కాగా, ఈ జరిమానాలు ఒక్క గూగుల్‌కే కాదు. ఈ ఏడాది.. విధించిన ఆంక్షాల‌ను వ్య‌తిరేకించిన పలు టెక్నాలజీ సంస్థలపై రష్యా కొరడా ఝళిపించింది. సాధారణంగా జరిమానా మిలియన్ డాలర్ల లోపే ఉండగా, ఈసారి మాత్రం భారీ స్థాయిలో జరిమానా విధించింది. గూగుల్ రెవెన్యూ ఆధారంగా ఈ జరిమానాను విధించినట్టు కోర్టు తెలిపింది. 

Read Also: జంతువుల్లోనూ coronavirus వ్యాప్తి.. 129 జింక‌ల్లో గుర్తింపు..

మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రమాదకరమైన ఆయుధాలు త‌యారీ, అశ్లీల అంశాలు, ఇత‌ర‌ పేలుడు పదార్థాల గురించిన సమాచారాన్ని తొల‌గించాల‌నీ, అలాగే తీవ్రవాద లేదా ఉగ్రవాద భావాలున్నా స‌మాచారాన్ని క్ర‌మంగా తొల‌గించాల‌ని కంపెనీలను రష్యా ఆదేశించింది. రష్యా ప్ర‌భుత్వం .. గూగుల్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ పదేపదే చేసిన తప్పే చేయడంతోనే కోర్టు ఈ జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, తర్వాత ఏం చేయబోతున్నది త్వరలోనే వెల్లడిస్తామని గూగుల్ తెలిపింది.

Read Also: కృష్ణపట్నం ఆనందయ్యకు జగన్ సర్కార్ షాక్: ఆ మందుకు అనుమతి లేదు.. వాడొద్దన్న ఆయుష్ శాఖ

రష్యా తన డిజిటల్ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో భాగంగా విదేశీ టెక్ కంపెనీలపై, ప్రత్యేకించి సోషల్ నెట్‌వర్క్‌లపై రష్యా మరింత ఒత్తిడి పెంచింది.
ఈ క్ర‌మంలో Meta (Facebook), Twitter, Google, ఇతర విదేశీ టెక్ దిగ్గజ కంపెనీలపై ఆంక్షాలు విధించింది. అనధికారిక నిరసనలను ప్రోత్సహించే పోస్టులు, చట్టవిరుద్ధమని భావించే ఇతర విషయాలను తొలగించమని Meta (Facebook), Twitter, Google, ఇతర విదేశీ టెక్ దిగ్గజ కంపెనీలను కోరుతోంది. 

అయితే.. ఆదేశాలను పెడచెవిన పెట్టే సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తోంది. అందులో భాగంగానే మాస్కో కోర్టు గూగుల్‌కు తాజా జరిమానా విధించింది. అమెరికా టెక్ కంపెనీలపై రష్యా ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. ఇది వ్యక్తిగత, కార్పొరేట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.