జంతువుల్లోనూ coronavirus వ్యాప్తి.. 129 జింకల్లో గుర్తింపు..
కరోనా వైరస్ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయ్యింది. అది కూడా మనుషుల నుంచి వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. దాదాపు 9 ప్రాంతాల్లో 360 తెల్ల తోక గల జింకల నాసల్ స్వాబ్స్ సేకరించగా.. అందులో 129 (35.8 శాతం) జింకలలో మూడు రకాల SARS-CoV-2 (B.1.2, B.1.582 మరియు B.1.596) వేరియంట్ల( Concern Variants )ను గుర్తించారు. ఈ అధ్యయనా ఫలితాలను నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాకొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ.. మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తి మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యాయనంలో వెల్లడైంది. ఈ అధ్యాయనం ప్రకారం.. కరోనా మహమ్మారి ఉద్ధృతి మనుషుల్లో కంటే.. జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్ల తోక జింకల్లో మూడు రకాల కొవిడ్-19 వేరియంట్స్‌ను US శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల నుంచే జింకలకు వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఒహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు .. జనవరి మరియు మార్చి 2021 మధ్య కాలంలో.. ఈశాన్య ఒహియో ప్రదేశాలలో దాదాపు 9 ప్రాంతాల్లో 360 తెల్ల తోక గల జింకల నాసల్ స్వాబ్స్ సేకరించారు. వీటిని, PCR టెస్టింగ్ ద్వారా పరీక్షించగా.. అందులో 129 (35.8 శాతం) జింకలలో మూడు రకాల SARS-CoV-2 (B.1.2, B.1.582 మరియు B.1.596) వేరియంట్లను గుర్తించారు. ఈ అధ్యయనా ఫలితాలను నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. అడవి జింకలు సార్స్ కోవ్-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.
Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బదిలీలకు గైడ్‌లైన్స్ విడుదల
వాటిలో వైరస్ దీర్ఘకాలం కొనసాగితే.. మనుషులకు సార్స్ కోవ్-2 వైరస్ సంక్రమించే కొత్త మూలాన్ని కలిగి ఉన్నట్లే. మనుషుల్లో మాదిరిగానే.. జింకల్లోనూ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని తెలిపారు.
read Also: దేశంలో 358కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఒహియో స్టేట్ యూనివర్శిటీలో వెటర్నరీ ప్రివెంటివ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ బౌమాన్ ప్రకారం.. అది భవిష్యత్తులో కొవిడ్-19 కట్టడి చేసే ప్రణాళికలను సంక్లిష్టంగా మార్చవచ్చునని తెలిపారు. మనుషుల నుంచి జింకలకు వైరస్ సంక్రమించిందని తెలిసింది. జింకల్లోకి ఆరు విభిన్న వైరస్లు సోకినట్లు మా వద్ద ఆధారాలున్నాయని, జింకల్లో వైరస్ మ్యుటేషన్లు జరిగితే.. మనుషులతో పాటు ఇతర జీవుల్లోకి కొత్త వేరియంట్లు సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపారు.
Read Also: ఒమిక్రాన్ నేపథ్యంలో ఉద్యోగులకు కొత్త పని విధానం ప్రవేశపెట్టనున్న కేంద్రం ?
2021 తొలినాళ్లలో ఒహియోలో B.1.2 వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, వేర్వేరు ప్రదేశాల్లోని జింక లోకి ప్రవేశించి ఉండొచ్చని విశ్లేషణలో తేలింది. ప్రతి ప్రాంతంలో 18 సార్లు నమూనాలు సేకరించారు. వివిధ ప్రాంతాల్లో జింకల్లో సంక్రమణ ప్రాబల్యం 13.5 నుండి 70 శాతం వరకు ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఎక్కువ జనసాంద్రత కలిగిన పరిసరాలతో అత్యధికంగా వ్యాప్తి చెందుతోందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు.