లండన్ లో పాలస్తీనాకు మద్దతు ర్యాలీలో ‘జిహాద్’ నినాదాలు.. వాటిని సహించబోమని హెచ్చరించిన రిషి సునక్..
లండన్ వీధుల్లో గత శనివారం నిర్వహించిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో ‘జిహాద్’ నినాదాలు మారుమోగాయి. దీనిపై యూకే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాలు యూదు సమాజానికే కాదు.. ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పని హెచ్చరించారు.
బ్రిటన్ వీధుల్ లో జిహాద్ కు పిలుపునివ్వొద్దని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హెచ్చరించారు. 1000 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడితో చెలరేగిన ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు అని తెలిపారు.
కలుషిత రక్తం మార్పిడి.. 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బీ,సీ, హెచ్ఐవీ పాజిటివ్..
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా సెంట్రల్ లండన్ లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సుమారు లక్ష మంది హాజరయ్యారు. అయితే ఇందులో అనేక మంది ‘జిహాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై రిషి సునక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ వారాంతంలో మేము మా వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మా దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించబోం. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము’’ అని రిషి సునక్ ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు.
దుర్గా పూజలో అపశ్రుతి.. మండపంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..
విద్వేషపూరిత తీవ్రవాదాన్ని పునరావృతం చేసే నిరసనకారులు చట్టం ద్వారా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ఇదిలావుండగా.. పాలస్తీనా అనుకూల నిరసనలో "జిహాద్" నినాదాలు చేసిన వారిని డిపార్ట్మెంట్ అధికారులు అరెస్టు చేయకపోవడంపై మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ సర్ మార్క్ రౌలీపై విమర్శలు వెల్లువెత్తాయి.