Asianet News TeluguAsianet News Telugu

పబ్ యజమానిపై ప్రతీకారం.. కిచెన్ లో 20 బొద్దింకలు వదిలిన చెఫ్...

ఉద్యోగం నుంచి తీసేశారని పబ్ కిచెన్ లో బొద్దింకలు వదిలాడో చెఫ్. దీంతో పబ్ డీప్ క్లీనింగ్ కు దాదాపు రూ.22 లక్షలకు పైగా ఖర్చయ్యింది. 

Revenge on pub owner, Chef left 20 cockroaches in kitchen In UK - bsb
Author
First Published Jan 24, 2023, 2:13 PM IST

యూకే : ఓ పబ్ లో పనిచేసి మానేసిన ఉద్యోగి.. దాని యజమాని మీద తనకున్న కోపానికి వింత రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. పబ్ కిచెన్ లోకి ఓ 20 బొద్దింకలను వదిలాడు. దీంతో ఆ యజమానికి రూ.22,25వేలు నష్టం భరించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే...యూకేలోని ఓ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి చెఫ్ గా పనిచేస్తున్నాడు. 

అక్కడ, యజమానితో అతనికి గొడవయ్యింది. దీంతో ఉద్యోగం పోయింది. దీనికి ప్రతీకారంగా అతను రకరకాల జాతులకు చెందిన 20 బొద్దింకలను పబ్‌లోని వంటగదిలోకి వదిలాడు. బీబీసీ నివేదిక ప్రకారం, టామ్ విలియమ్స్ (25) అనే వ్యక్తికి అక్టోబర్ 11, 2022న హాలిడే జీతం విషయంలో యజమానితో విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా లింకన్‌లోని రాయల్ విలియం 4 పబ్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి.. మూడు రోజుల వ్యవధిలో రెండో ఘటన..

ఆ తరువాత రెండు రోజులకు కిచెన్ లో 'బొద్దింక బాంబు'ను విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీనిమీద యజమాని మాట్లాడుతూ.. అతను ముందుగానే ఇలా చేస్తానని బెదిరించాడు. కానీ మేము నిజంగా చేస్తాడని అనుకోలేదు అన్నారు. దీంతో ఆరోగ్యం, భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది వెంటనే పబ్‌ను మూసివేశారు. పర్యావరణ ఆరోగ్య అధికారులను, పెస్ట్ కంట్రోల్‌ను పిలిపించారు. ఫలితంగా, పబ్ డీప్ క్లీన్ కోసం దాదాపు 22,000 పౌండ్లు (రూ. 22,25,410) ఖర్చు చేయాల్సి వచ్చింది. 

దీనిమీద యజమాని కోర్టు కెక్కాడు. కోర్టు విచారణల ప్రకారం, 25 ఏళ్ల చెఫ్ ప్రాంగణంలోకి ప్రవేశించి, కనీసం 20 స్థానికేతర జాతుల బొద్దింకలను కిచెన్ లోకి విడుదల చేశాడు. వీటిని ''పాములు, ఒక రకమైన పెద్ద సాలీడ్లకు ఆహారంగా ఉపయోగిస్తారు''.. దీనికి సంబంధించి ప్రాసిక్యూటర్ డేవిడ్ ఈగర్ కోర్టులో పబ్ యజమాని చేసిన ఒక ప్రకటనను చదివాడు. 

దీంట్లో ఇలా ఉంది.. "సిబ్బంది, వారి కుటుంబాలపై దీని ప్రభావం చాలా పెద్దది. ఇది కేవలం కంపెనీ ఆర్థిక విషయాలే కాదు, మిగిలిన రాయల్ విలియం జట్టు, ముఖ్యంగా కిచెన్ టీమ్, జరిగిన దానితో కలత చెందారు. వారు నిరాశకు గురయ్యారు. వారితో కలిసి పనిచేసిన వారే వారి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు”అని ఆ ప్రకటనలో ఉంది. 

విలియం చర్యలు సిబ్బందిని తీవ్రంగా ప్రభావితం చేశాయని, వారు వంటగదిని నిరంతరం శుభ్రం చేయడంలో ఎక్కువ గంటలు శ్రమించాల్సి వచ్చింది. నవంబర్ 21న విచారణకు రావాల్సిన విలియమ్స్ కూడా కోర్టుకు హాజరు కాలేదు. క్రిమినల్ నష్టాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ఇలా చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. నిందితుడైన చెఫ్‌కు 17 నెలల జైలు శిక్ష విధించబడింది. 200 గంటల పాటు ఉచితంగా కమ్యూనిటీ పని పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.

జడ్జి కాటరినా స్జోలిన్ నైట్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ, "ఒక మెసేజ్‌లో 'పబ్‌పై బొద్దింక బాంబు వేస్తాను' అని బెదిరించింది. సరిగ్గా అదే మీరు చేసారు. ఇది ప్రతీకారం, మీరు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. మీరు పెద్దవారు అయినా.. ఉన్నప్పటికీ మీరు చాలా అపరిపక్వంగా వ్యవహరించారు. మీ పిల్లలు, సమాజం దీనినుంచి ప్రబావితం అయ్యే ప్రమాదం ఉంది అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios