శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రెండు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు. అంతకుముందు.. భారతదేశ రూపాయిపై రానిల్ విక్రమసింఘేపై కీలక ప్రకటన  చేశారు.  

అమెరికా డాలర్‌తో సమానంగా భారత రూపాయిని ఉపయోగించాలని శ్రీలంక కోరుకుంటోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో ఈ కీలక ప్రకటన చేశారు. జపాన్, కొరియా, చైనాలతో సహా పశ్చిమాసియా దేశాలు అపూర్వమైన ఆర్థిక వృద్ధిని సాధించినట్లే.. ఇప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఆర్థిక వృద్ధి సాధించాలని అధ్యక్షుడు విక్రమసింఘే కోరుకున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే ప్రసంగిస్తూ, భారత రూపాయి సాధారణ కరెన్సీగా మారితే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, దీనితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. శ్రీలంక భారతదేశానికి సామీప్యతతో పాటు గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం , 2,500 సంవత్సరాల నాటి వాణిజ్య సంబంధాల వల్ల తమ ప్రయోజనం పొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విక్రమసింఘే తన దేశ ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ.. తాము ఆర్థిక సంక్షోభం నుండి బయటికి వస్తున్నామనీ, మందగమనం ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రెండు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు. జూలై 21న రణిల్ విక్రమసింఘే న్యూఢిల్లీకి చేరుకుంటారు. ఇక్కడ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.