Asianet News TeluguAsianet News Telugu

టెక్సాస్ లో జాత్యహంకారం.. ఇండియ‌న్-అమెరికన్ ల‌ను బెదిరించి, కొట్టిన మహిళ.. వీడియో వైరల్

టెక్సాస్ లోని ప్లానోలో ఓ మహిళ అమెరికన్- భారతీయ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఇండియాకు వెళ్లిపోవాలని అరిచింది. తాను ఎక్కడికి వెళ్లినా భారతీయులే కనిపిస్తున్నారని చెబుతూ దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

Racism in Texas.. Woman threatens and beats Indian-Americans.. Video goes viral
Author
First Published Aug 26, 2022, 10:47 AM IST

టెక్సాస్‌లో జాత్యహంకార ఘటన చోటు చేసుకుంది. ప్లానోలోని సిక్స్టీ వైన్స్ రెస్టారెంట్ ఒయ‌ట ఓ అమెరికన్ మ‌హిళ భార‌తీయ మ‌హిళ‌ల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. స‌మీపంలోని పార్కింగ్ ఏరియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు దాడి కూడా చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

ఐదున్నర నిమిషాలున్న ఈ వీడియోలో ఆ మ‌హిళ ఒక‌రి ముఖంపై కొడుతోంది. ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల ఫోన్ ల‌ను కూడా లాక్కునేందుకు ప్ర‌య‌త్నింస్తోంది. ఆమె త‌న బ్యాగ్ లో చేయి పెట్టి కాల్చేస్తాన‌ని బెదిరించడం కూడా క‌నిపిస్తోంది. దీంతో పాటు భార‌తీయ మ‌హిళ‌ల గుంపును ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. ‘గో బ్యాక్ టు ఇండియా’ అని చెబుతూనే.. ‘మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు’ అని కూడా అరవడం వినిపిస్తోంది.

నటి, బీజేపీ నేత సోనాలిది హత్యే.. కీలక మలుపు తిప్పిన పోస్టుమార్టం నివేదిక, ఇద్దరు అరెస్ట్..

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. నిందితురాలిని  ఎస్మెరాల్డా అప్టన్‌గా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ విష‌యాన్ని ప్లానో పోలీస్ డిపార్ట్‌మెంట్ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆమె శారీర‌కంగా దాడి చేసి, తీవ్రవాద‌ బెదిరింపుల‌కు పాల్పడింద‌ని ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది. ప్రస్తుతం దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నారు.

ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం అర్థరాత్రి ఫేస్‌బుక్‌లో స‌ర్క్యులేట్ అయ్యింది. అయితే గురువారం రెడ్డిట్‌లో ‘‘ ప్లానోలో గత రాత్రి కొంతమంది భారతీయ స్నేహితులకు ఇది జరిగింది ’’ అనే క్యాప్షన్ తో వైరల్ అయ్యింది. గొడవ మొదలైన కొద్ది సేపటికే ఈ వీడియో రికార్డ్ అవ్వ‌డం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా గో బ్యాక్ టు ఇండియా అనే ప‌దం ప‌దే ప‌దే వినిపిస్తోంది. ఆ మహిళ తాను మెక్సికన్ అమెరికన్ అని చెప్పారు. 

‘‘ నేను ఎక్కడికి వెళ్లినా.. మీ భారతీయులు ప్రతిచోటా ఉంటున్నారు. భారతదేశంలో జీవితం చాలా గొప్పగా ఉంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు?ష‌ అని ఆమె అన్నారు. ఆమె మాట‌ల‌కు ఇటు వైపు ఉన్న మహిళ‌ల్లో ఒక‌రు ఫైర్ అయ్యారు. ‘‘ మీరు మెక్సికన్ అయితే, మీరు ఎందుకు మెక్సికోకు తిరిగి వెళ్లకూడదు ’’ అంటూ కెమెరాకు వెనకాల ఉన్న ఒకరు చెప్పడం వినిపిస్తోంది. 

ఆర్ఆర్ బి ఎగ్జామ్ : వేడినీటిపై చేయిపెట్టి బొటనవేలి చర్మం కత్తిరించి.. స్నేహితుడి చేతికి అతికించి.. చివరికి...

నల్లటి దుస్తులు ధరించిన అప్టన్ మహిళ.. ఇతర మహిళలో ఒకరిని తన పిడికిలితో గుద్దడం ఈ వీడియోలో కనిపించింది. అలాగే దీనిని రికార్డ్ చేస్తున్న ఫోన్ ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆప్టన్ ఫోన్ ను అనేక సార్లు కొట్ట‌డం క‌నిపిస్తోంది. మ‌రో మ‌హిళ ద‌గ్గ‌రికి వెళ్లి త‌న ప‌ర్స్ లో చేయి పెట్టి ‘‘ ఫోన్ ను ఆఫ్ చేయండి. లేదా నేను మిమ్మల్ని కాల్చేస్తాను. దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను ’’ అని ఆమె వ్యాఖ్యానించారు. 

ఈ ఘ‌ట‌న‌పై కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది, దీనిపై అప్టన్‌పై దర్యాప్తు చేసి అభియోగాలు మోపాలని కోరింది. ‘‘ ప్లానోలో నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలపై భౌతిక దాడి నిజంగా భయంకరంగా ఉంది ’’ అని CAIR ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైజాన్ సయ్యద్ అన్నారు. ‘‘ ఈ రకమైన ద్వేషానికి ఉత్తర టెక్సాస్‌లో స్థానం లేదు. ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిశోధించాలని మేము లా ఎన్ ఫోర్స్మెంట్ ను కోరుతున్నాం ’’ అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios