పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు..
రష్యా అధ్యక్షుడిగా మరో సారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరో సారి ఎన్నికయ్యారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అభినందనలు తెలియజేశారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నరేంద్ర మోడీ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా రష్యాలోని స్నేహపూర్వక ప్రజల శాంతి, పురోభివృద్ధి, సౌభాగ్యాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్-రష్యా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. వారు ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో చర్చలు, దౌత్యమే మార్గమని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సమిష్టి ప్రయత్నాలు చేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాల్లో పురోగతిని సమీక్షించిన నాయకులు.. పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చిస్తూ, చర్చలు, దౌత్యమే ముందున్న మార్గమని భారత్ స్థిరమైన వైఖరిని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. కాగా.. ఇరువురు నేతలు టచ్ లో ఉండేందుకు అంగీకరించారు.