అందాల సుందరిని గర్భవతిని చేసిన రాజకీయనేత

First Published 4, Aug 2018, 11:39 AM IST
politician affair with model in kenya
Highlights

అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్న ఓ యువతిని గర్భవతిని చేశాడో రాజకీయ నేత. కెన్యాలోని నైరోబి నగరానికి చెందిన ఓ యువతి మోడల్‌గా పనిచేస్తోంది. 

అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్న ఓ యువతిని గర్భవతిని చేశాడో రాజకీయ నేత. కెన్యాలోని నైరోబి నగరానికి చెందిన ఓ యువతి మోడల్‌గా పనిచేస్తోంది. ఇటీవల జరిగిన అందాల పోటీల్లో పాల్గొని అందాల సుందరిగా కీరిటాన్ని దక్కించుకుంది. ఆమె అందానికి ఆకర్షితుడైనా ఓ ప్రముఖ రాజకీయ నేత యువతితో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు.

ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సదరు రాజకీయనేత వద్ద ప్రస్తావించి తనను వివాహం చేసుకోమని అడగ్గా.. తమ సంబంధం, గర్భం గురించి మీడియాకు గానీ, పోలీసులకు గానీ చెబితే చంపేస్తానని బెదిరించాడు. మరోవైపు విషయం బయటకు పొక్కడంతో సదరు రాజకీయ నాయకుడు స్పందించాడు.. అందాల రాణి తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని.. తాను నిర్ధోషిని అని అంటున్నాడు.

loader