Asianet News TeluguAsianet News Telugu

Modi America Visit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ

మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజిబిజీగా వున్న ప్రధాని నరేంద్ర మోడీ .. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు చర్చించినట్టు తెలుస్తోంది.

pm narendra modi held meeting with us president joe biden in white house
Author
Washington D.C., First Published Sep 24, 2021, 9:24 PM IST

మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజిబిజీగా వున్న ప్రధాని నరేంద్ర మోడీ .. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, ఇతర సమస్యలపై కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం భాగస్వాములం అవుతామని వెల్లడించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మోడీ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత వైట్‌హౌస్‌లో జరగనున్న క్వాడ్ సదస్సులో మోడీ హాజరు కానున్నారు. రేపు న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మోడీ ప్రసంగించనున్నారు. 

అంతకుముందు అమెరికా, భారత దేశ భద్రతపై వైట్ హౌస్ లో గురువారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమయంలో వారు ఇండో-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రజా స్వామ్యం, ఆప్ఘనిస్తాన్ , ఇండో-పసిఫిక్ కు ఉన్న ముప్పులతో సహా అన్ని ప్రపంచ సమస్యలపై వీరు చర్చ జరపడం గమనార్హం.

తీవ్రవాదం సమస్య వచ్చినప్పుడు.. ఈ విషయంలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా తెలిపారు. ఉగ్రవాదం లో పాకిస్తాన్ పాత్ర ఎంత వరకు ఉండవచ్చని కమలాహ్యారిస్ మోదీని ప్రశ్నించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  అమెరికా భద్రత, భారతదేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని  ఆమె ఈ సందర్భంగా పాకిస్తాన్ ని కోరడం గమనార్హం. అనేక దశాబ్దాలుగా భారత్ తీవ్రవాదం బారినపడిందని మోదీతో సమావేశం తర్వాత ఆమె అంగీకరించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios