ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన వ్యక్తి అని, ఆయనను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా కంటెస్టెంట్ సారా టాడ్ అన్నారు. ఆయనకు భారత్ పట్ల విజన్ ఉందని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆస్ట్రేలియా సెలబ్రిటీ చెఫ్ సారా టాడ్ మంగళవారం పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ అద్భుతమైన వ్యక్తి అని, ఆయనను కలవడం తన అదృష్టం అని అన్నారు. సిడ్నీలో భారత ప్రధానిని మంగళవారం ఆమె కలిశారు. అనంతరం ఆమె వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ట్రక్కు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు.. ఎక్కడంటే ?
‘‘ భారత ప్రధాని అద్భుతమైన వ్యక్తి. ఆయనను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతడు దేశం, విజన్ పై శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రధాని నమ్మశక్యం కాని ప్రభావశీలి. వినయపూర్వకమైన ప్రారంభం నుండి వచ్చి దేశంలో నాయకుడిగా నిలిచారని నేను అనుకుంటున్నాను ’’ అని అన్నారు.
సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ వర్క్, ఆర్ట్, మ్యూజిక్ వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తున్న ఇతర ప్రముఖ ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళశారం సంభాషించారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాల బలోపేతానికి దోహదం చేయాలని వారిని కోరారు.
ప్రధాని కలిసిన ప్రముఖ ప్రజా వ్యక్తులలో కళాకారుడు డేనియల్ మేట్, నోబెల్ బహుమతి గ్రహీత బ్రియాన్ పాల్ ష్మిత్, ‘టాయిలెట్ యోధుడు’ మార్క్ బల్లా, రాక్స్టార్ గై సెబాస్టియన్ ఉన్నారు. భారత్ లో స్వచ్ఛభారత్ అభియాన్ ద్వారా పారిశుద్ధ్య రంగంలో ప్రపంచవ్యాప్తంలో ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని మార్క్ బల్లా కొనియాడారు. వారు అంతకు ముందు పారిశుధ్యం అనే అంశంపై మాట్లాడారు. నోబెల్ బహుమతి గ్రహీత ష్మిత్ మాట్లాడుతూ.. సైన్స్, పరిశోధనపై ప్రధాని మోడీతో చాలా సుసంపన్నమైన సంభాషణ జరిగిందని అన్నారు. ఆస్ట్రేలియా కళాకారుడు మేట్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీలో ‘సృజనాత్మక అంశం’ ఉందని, రెండు దేశాల కళలు, సంస్కృతిలో సారూప్యతలను చూడగలనని అన్నారు.
వారెవ్వా.. నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లి.. ఇంట్లోనే బావి తవ్విన 14 ఏళ్ల బాలుడు
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ అంతకు ముందు అగ్రశ్రేణి ఆస్ట్రేలియా కంపెనీల వ్యాపార ప్రముఖులతో సమావేశమై టెక్నాలజీ, నైపుణ్యం, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారత పరిశ్రమతో సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. హాంకాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రినార్ట్, ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈఓ పాల్ ష్రోడర్ లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం సిడ్నీ చేరుకున్న మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో చర్చలు జరుపుతారు.