ప్రధాని నరేంద్రమోడీని  గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్  ఆఫ్ హానర్ తో ఫ్రాన్స్ సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధానిగా  మోడీ చరిత్ర సృష్టించనున్నారు.

ఫారిస్: ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ లో అరుదైన గౌరవం దక్కింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్‌ది లెజియన్ ఆఫ్ హానర్ ను అందించింది ఫ్రాన్స్. ఇది సైనిక లేదా పౌర ఆర్డర్ లలో అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డులకెక్కనున్నారు.

గతంలో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన నేతలు అందుకున్నారు. వీరిలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, వేల్స్ యువరాజు, జర్మనీ మాజీ చాన్సిలర్ ఎంజెలా మెర్కెల్ , ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ తదితరులు ఈ పురస్కారం పొందినవారిలో ఉన్నారు.

ప్రధాని మోడీకి వివిధ దేశాలు అందించిన అత్యుత్తమ అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాల్లో ఫ్రాన్స్ అందించిన గౌరవం ఒకటి. రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. నిన్ననే మోడీ ఫ్రాన్స్ టూర్ కు వెళ్లారు. మోడీకి ఫ్రాన్స్ లో ఘన స్వాగతం పలికారు.