లాస్ ఏంజిల్స్: అమెరికాలో కార్లు, బస్సులు తిరిగే రోడ్లపై ఓ
విమానం అత్యవసరంగా ల్యాండైంది.అయితే ఈ ఘటనలో
ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. విమానం ఇంజన్ లో
సాంకేతిక లోపం ఏర్పడడంతో పైలెట్ అత్యవసరంగా
విమానాన్ని రోడ్డుపై ల్యాంగ్ చేయాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ
వీడియో వైరల్ గా మారింది.


అమెరికాలోని లాస్ఏంజిల్స్ రోడ్డులో అత్యంత రద్దీగా
ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై సెస్నా 172 రకానికి చెందిన
తేలికపాటి విమానం  అత్యవసరంగా ల్యాండైంది. విమానం
ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా
అత్యవసరంగా లాస్ ఏంజిల్స్ రోడ్డుపై ల్యాండ్ చేయాల్సిన
పరిస్థితులు నెలకొన్నాయి.
జాన్ వెయిన్ ఎయిర్ పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే
ఈ విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన
విషయాన్ని పైలెట్ గుర్తించారు. 
ఈ విమానాన్ని ఓ మహిళ
పైలెట్ నడుపుతున్నారు. 

హంటింగ్టన్  బీచ్ రోడ్డుపై  విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్
చేసింది. రోడ్డుపై విద్యుత్ స్థంబాలు, వాహానాలను
దాటుకొంటూ విమానం నడిరోడ్డుపై ల్యాండ్ అయింది.

అయితే అత్యవసర పరిస్థితుల్లో విమానం ల్యాండ్ కావడంతో
ఈ రోడ్డును కొద్దిసేపు పోలీసులు మూసివేశారు.