Plane crashes into car : కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..
Plane crashes into car : ఓ కారును విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మెక్ కిన్నీ నగరంలో చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా విమానం గాలిలో ఎగురుతుంటుంది. కారు రోడ్డుపై ప్రయాణిస్తుంటుంది. కానీ ఒక దాని వల్ల మరో దానికి ప్రమాదం జరుగుతుందని ఎప్పుడైనా అనుకుంటామా ? అస్సలు అనుకోము కదా.. ఎందుకంటే అవి రెండు ప్రయాణించే మార్గాలు వేరు. కాబట్టి అవి రెండు ఒక దానినొకటి ఢీకొనడం అసాధ్యం. కానీ అమెరికాలో ఇది జరిగింది. ఓ విమానం రోడ్డుపై ప్రయాణించే కారును ఢీకొట్టింది.
కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చండి - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై మండిపడ్డ ఓవైసీ
అసలేం జరిగిందంటే ?
అది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మెక్ కిన్నీ నగరం. అక్కడి ఏరో కంట్రీ ఎయిర్ పోర్టు నుంచి చిన్న Iv-పీ ప్రాప్‌జెట్ విమానం గాలిలోకి ఎగిరింది. అయితే కొంత సేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులకు తెలియజేశారు.
అయితే రన్ వై విమానం దిగిన తరువాత అది అదుపుతోకి రాలేదు. వేగంగా కంచె దాటి వెళ్లింది. పక్కనే ఓ రోడ్డు ఉంది. విమానం వేగంగా వస్తున్న ఆ సమయంలో అటు నుంచి కారు వెళ్తోంది. ఇంకేముంది ఈ విమానం వెళ్లి నేరుగా ఆ కారును ఢీకొట్టింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. విమానంలోని పైలట్, ప్రయాణికుడిని అలాగే ఆ కారు డ్రైవర్ ను కూడా కాపాడారు. వీరిలో ఒకరికి గాయాలు కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
130 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు.. ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఇద్దరు మృతి.. అసలేం జరిగిందంటే..
కాగా.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎఫ్ఏఏ పరిశోధకులు రంగంలోకి దిగారు. రోడ్డును గంటల తరబడి మూసివేశారు. దీంతో ట్రాఫిక్ కు కొంత జామ్ అయ్యింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో అమెరికాలో విమాన ప్రమాదాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2019 సంవత్సరాల్లో 397 మంది చనిపోయారు. అలాగే 2021లో కూడా 268 మంది మరణించారు. ప్రొఫెషనల్ పైలెట్లు లేకపోవడం, రన్ వేపై దిగే సమయంలో విమానాలు కంట్రోల్ కాకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.