ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం మరో విమాన ప్రమాదం సంభవించింది. జాతీయ విమానయాన సంస్థ ఆరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన ఎఫ్‌జీ507 విమానం 83 మందితో హెరాత్ నుంచి కాబూల్‌కు బయల్దేరింది.

ఈ నేపథ్యంలో తూర్పు గజినీ ప్రావిన్స్‌లోని పర్వతాలతో నిండిన దేహ్ యాక్ జిల్లాలోని సాడో ఖేల్ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.15 గంటలకు కాబూల్‌కు ఆగ్నేయంగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

నివేదికల ప్రకారం.. తాలిబన్లు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకుని మండలను ఆర్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలో ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడానికి వారితో ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంటుంది. గజనీ ప్రావిన్షియల్ గవర్నర్ అధికారిక ప్రతినిధి ఆరిఫ్ నూరి ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. 

Also Read:

అమెరికాలో కూలిన విమానం... నలుగురు మృతి

ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం... 167మంది మృతి