ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టెహ్రాన్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం కుప్ప కూలింది. ఉక్రెయిన్ నుంచి విమానం బయలు దేరింది. కాగా.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 167మంది ప్రయాణిస్తుండగా.. వారిలో 160మంది ప్రయాణికులు కాగా... మరో ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. 

కాగా... ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలి బూడిదయ్యింది. కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడం విషాదకరం. ఈ విషయాన్ని రష్యన్ టుడే ధ్రువీకరించింది.  ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని సంబంధిత అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.