ప్రయాణికులు కిందకు దిగుతుండగా... విమానం మూడు ముక్కలయ్యింది. ఈ భయంకర సంఘటన టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వాతావరణ పరిస్థితులు అనుకూలించక బుధవారం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం రన్ వేపై అదుపుతప్పింది. దీంతో... విమానం మూడు ముక్కలయ్యింది. 

Also Read రోడ్డుపై మృతదేహం: తొంగి చూడని జనం, మానవత్వాన్ని చంపేస్తున్న ‘కరోనా’ భయం...


పెగాసస్ ఎయిర్ లైన్స్  సంస్థకు చెందిన విమానం 179 మంది ప్రయాణికులను తీసుకొని ఇజ్మీర్ నగరం నుంచి ఇస్తాంబుల్ కి వచ్చింది. అనంతరం సబీహా గోక్సెన్ విమానాశ్రయంలో కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురైంది. రన్ వేపై అదుపు తప్పింది. 

ఈ క్రమంలో విమానం మూడు ముక్కలుగా విరిగిపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మరి కొందరు ప్రయాణికులు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారని..  అధికారులు చెప్పారు. ప్రయాణికులు విమానం నుంచి కిందకు దిగిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగాయని వారు తెలిపారు.